న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం ఎన్ ఎం ఆర్, టైమ్ స్కేల్ ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్ర సందర్భంగా మంగళవారం శ్రీశైలం నియోజకవర్గం బండిఆత్మకూరు శివారు క్యాంపు సైట్ లో కర్నూలుజిల్లా ఎన్ఎంఆర్, టైమ్ స్కేల్ ఉద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం
సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఎన్ఎంఆర్, టైం స్కేలు ఉద్యోగులుగా 3 దశాబ్ధాలుగా సేవలందిస్తున్నాం.
ఉమ్మడి రాష్ట్రంలో మా సంఖ్య 10వేలు ఉండగా, కొందరు అనారోగ్యానికి గురై మరణించారు, మరికొందరు పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం 4,365మంది ఫుల్ టైం, 380మంది పార్ట్ టైంగా సేవలందిస్తున్నాం.
తెలంగాణా రాష్ట్రంలో పంచాయితీరాజ్, విద్య, అటవీశాఖల్లో పనిచేస్తున్న మా సహచర సిబ్బంది (1993కి పూర్వం పనిచేస్తున్నవారు)ని క్రమబద్దీకరించారు.
గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పారు.
సర్సీసు క్రమబద్ధీకరణ సకాలంలో జరగకపోవడంతో 30సంవ్సరాల సర్వీసు ఉన్నప్పటికీ అనారోగ్యానికి గురై మరణించిన సిబ్బంది కుటుంబాలు ఎటువంటి బెనిఫిట్స్ అందక రోడ్డున పడుతున్నారు.
25-11-1993 నాటికి విధుల్లో ఉండి పదేళ్లు సర్వీసు ఉన్న పార్ట్ టైమ్ సిబ్బందిని క్రమబద్దీకరించాలి.
25-11-1993 నాటికి ముందుగానే నియమితులై సర్సీసు క్రమబద్దీకరణ కాకుండానే పదవీవిరమణ చేసిన వారి కుటుంబాలకు గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.
సర్వీసు క్రమబద్దీకరణ కాకుండా మరణించిన ఎన్ఎంఆర్, టైం స్కేలు ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలి అని వారంతా లోకేష్ కు విన్నవించారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా మోసగించారు.
అధికారం కోసం రకరకాల హామీలు ఇచ్చి వంచించిన సిఎం ఆ తర్వాత అందరినీ నట్టేట ముంచాడు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవు.
దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్, టైమ్ స్కేలు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.