టిడిపి అధికారంలోకి రాగానే కంబళ్ల తయారీకి ఉన్నిని సరఫరాచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో
భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురం నేషనల్ హైవేపై కురుబ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గొర్రెలమేపుకు గ్రామాల్లో 5ఎకరాల బంజరు భూమి కేటాయించాలి.
ఎండనక, వాననక తిరుగుతూ జీవనం సాగించే కురుబలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి.
75శాతం సబ్సిడీపై గొర్రెల కొనుగోలుకు రుణాలు మంజూరు చేయాలి.
మాదాసి కురువ, మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ల ఇవ్వాలి.
పర్ల, కంబళ్లపాడు, సల్కాపురంలో కంబళ్ల తయారుచేసే కురుబలకు కంబళ్ల సొసైటీ ద్వారా ఉన్ని సరఫరా చేసి ఆదుకోవాలి అనివ్ ఆరు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల మేపుకోసం గతంలో కేటాయించిన భూములను వైసిపి నేతలు ఆక్రమించారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలమేపుకు కేటాయిస్తాం.
22గొర్రెలు యూనిట్ గా సబ్సిడీపై గొర్రెల కొనుగోలుకు రుణాలు ఇస్తాం.
గతంలో ఇచ్చిన జిఓలు, గెజిట్ లు పరిశీలించి మాదాసి కురవ, మాదారి కురవలకు న్యాయం చేస్తామని లోకేష్ వెల్లడించారు.