టిడిపి అధికారంలోకి రాగానే గ్రామపంచాయితీలకు నిధులు, అధికారాలు ఇచ్చి బలోపేతం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్ల్దించారు. యువగళం పాదయాత్ర
సందర్భంగా మంగళవారం కోడుమూరు నియోజకవర్గం పూడూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
మా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి.
రోడ్లు సరిగా లేకపోవడంతో అంబులెన్సు కూడా వచ్చే పరిస్థితి లేదు.
రైతులకు సబ్సిడీలు అందడం లేదు.
గ్రామంలోని పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది.
వీధి దీపాలు చెడిపోతే పట్టించుకునేవారు లేరు.
మా గ్రామానికి బస్సు సౌకర్యం, వైద్య సదుపాయం లేదు.
మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి. అనివ్ ఆరు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను నిర్వీర్యం చేశారు.
పంచాయతీలకు సంబంధించిన రూ.8,600కోట్లను జగన్మోహన్ రెడ్డి దొంగిలించారు.
పంచాయితీ సర్పంచ్ లు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించారు.
పాడైపోయిన రోడ్లపై కనీసం తట్ట మట్టిపోసే దిక్కులేదు.
టిడిపి అధికారంలోకి వచ్చాక మళ్లీ గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తాం.
గ్రామాల్లో మౌలిక సదుపయాలకు పెద్దపీట వేస్తాం అని నారా లోకేష్ హామీ ఇచ్చారు.