టిడిపి అధికారంలోకి రాగానే చారిత్రక ప్రాధాన్యత కలిగిన తాండ్రపాడు చెరువు ఆక్రమణలపై విచారణ జరిపించి, భూములను స్వాధీనం చేసుకొని తిరిగి చెరువును ఏర్పాటుచేస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం కోడుమూరు నియోజకవర్గం బి.తాండ్రపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలు
చెప్పుకున్నారు.
గ్రామంలో గంగమ్మ చెరువు కబ్జాకు గురైంది.
గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లతోపాటు, మంజూరైన ఇళ్ల పట్టాలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఎక్కువయ్యాయి.
ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు, అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాలి.
గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్డు విస్తరణ పనులు నిలిపివేశారు. ట్రాఫిక్ జామ్ అయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని వారు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
దాదాపు రూ.500 కోట్ల విలువైన బి.తాండ్రపాడు చెరువును వైసిపి భూమాఫియా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి దోచుకుంటోంది.
టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు రంగులువేసుకొని, లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక సెంటుపట్టా పేరుతో రూ.7వేలకోట్లు దోచుకున్నారు.
వైసిపి మాఫియాల కారణంగా కొండలు, గుట్టలు, చెరువులు మాయమవుతున్నాయి.
కోడుమూరు ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేల అవినీతిని బాగోతాన్ని బయటకుతీసి ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం.
రోడ్డు విస్తరణ పనులు చేపట్టి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.