టిడిపి అధికారంలోకి రాగానే మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బనగానపల్లె ఆస్థానం సెంటర్ లో ముస్లిం సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
గత నాలుగేళ్లలో మాకు ఒక్క లోన్ కూడా రాలేదు. మా మండలంలో మైనారిటీలకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.
టీడీపీ హయాంలో మొదలుపెట్టిన షాదీఖానా పనులు 50శాతం పూర్తయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే జోక్య, చేసుకుని పనులు నిలిపివేశాడు. గత ప్రభుత్వంలో మైనారిటీ యువతులకు పెళ్లికానుక కింద రూ.50వేలు వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చాక నిలిపివేశారు.
మా నియోజకవర్గంలో 50శాతం మైనారిటీలున్నారు.ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయాలి.
రంజాన్ తోఫా ను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది.
గత ప్రభుత్వంలో హజ్ యాత్రకు కార్పొరేషన్ ద్వారా పంపేవారు. వైసీపీ ప్రభుత్వం హజ్ యాత్రలను నిలిపేశారు.
మైనారిటీ విద్యార్థులకు విదేశీవిద్యను అందించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేగాక తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక 50మంది మైనారిటీలపై దాడులు, హత్యలు జరిగాయి.
జగన్ పాలనలో మైనారిటీల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. వక్ఫ్ ఆస్తులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారు. మైనారిటీల స్వావలంబనకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం.
పూర్తి ప్రభుత్వ ఖర్చులతో హజ్ యాత్రకు పంపిస్తాం.
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేద ముస్లింలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.