మరింత పటిష్టంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు
అభివుద్ధి కార్యక్రమాలకు ఎస్సీ కాలనీల నుంచే శ్రీకారం
జగన్ పాలనలో దళితులపై దమనకాండ
దళితుల్లో 62 ఉపకులాలకు న్యాయం
ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధులతో నారా లోకేష్ ముఖాముఖి
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు భూమి కొని కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం
కోడుమూరు నియోజకవర్గం వెంకటగిరిలో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మరింత పటిష్ఠంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని లోకేష్ చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కాలనీల నుండే అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించాలి అని తాను నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జగన్ దళిత ద్రోహి.
జగన్ పాలనలో దళితులపై దమనకాండ జరుగుతుంది.
దళితుల్ని చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు.
దళితుల్ని చంపి జగన్ డోర్ డెలివరీ చేయిస్తున్నాడు. దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే దుర్మార్గపు పాలన జగన్ ది అని విమర్శించారు. జగన్ 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసాడు.
టిడిపి సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది.
దళితుల్లో ఉన్న 62 ఉపకులాలకు న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభించి, అంబేద్కర్ గారి పేరు పెడతాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి వైసిపి నాయకులు లాక్కున్న దళితుల భూములు అన్ని తిరిగి దళితులకు అందిస్తామని లోకేష్ వెల్లడించారు. తాను మంత్రిగా వున్న సమయంలో సిసి రోడ్లు, త్రాగునీరు, ఎల్ఈడి వీధి దీపాలు అన్ని మొదట ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తరువాతే మిగిలిన కాలనీల్లో మొదలుపెట్టేలా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఎంటి అని నేను అంటే ఫేక్ వీడియో తయారు చేసి హడావిడి చేస్తున్నారు.
జగన్ చెబితే ఎవరూ నమ్మడం లేదు అని భారతీ రెడ్డి గారిని రంగంలోకి దింపారు. ఆవిడ ఒక ఫేక్ వీడియో తయారు చేసి నేను దళితుల్ని హత్య చేశానని అసత్య ప్రచారం చేస్తున్నారు.
నేను ఇప్పటికే అనేక సార్లు సవాల్ చేసాను. నేను దళితుల్ని అవమానపర్చానని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటాను.
నిరూపించలేకపోతే సాక్షి మీడియా ని మూసేస్తారా భారతీ రెడ్డి గారు?అని లోకేష్ ప్రశ్నించారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్, ఇసుక అక్రమాల పై పోరాడినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టారు, మాస్క్ వేసుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు. వైసిపి నాయకుల అవినీతి పై పోరాడినందుకు డాక్టర్ అనితా రాణిని వేధించారు. జే బ్రాండ్ లిక్కర్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ ని చంపేశారు. ఇన్ని దారుణాలు జరిగితే మంత్రి సురేష్ చొక్కా విప్పి ఎందుకు జగన్ ముందు ధర్నా చెయ్యలేదు. నన్ను అడ్డుకోవడానికి వచ్చిన కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ జగన్ ని ఎందుకు అడ్డుకోలేదు. అని ప్రశ్నించారు.
వర్గీకరణతో మేలు
2001 లో రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు.
దాని ద్వారా మాదిగ, ఉప కులాలకు 27 వేల ఉద్యోగాలు వచ్చాయి.
వేల మందికి మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి.అని లోకేష్ తెలిపారు. వైయస్ వేయించిన కేసు కారణంగా వర్గీకరణ ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన నాటకం, జగన్ పాలనలో జరుగుతున్న నాటకం మీరు చూస్తున్నారు.
సుప్రీం కోర్టు పార్లమెంట్ లో చట్టం ద్వారా వర్గీకరణ చెయ్యాలని డైరెక్ట్ చేసింది.
ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో చంద్రబాబు జీఓ 25 తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాల అమలులో వర్గీకరణ తీసుకొచ్చారు.
ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా జీఓ 25 తీసుకొచ్చారు చంద్రబాబు అని లోకేష్ వివరించారు. జీఓ 25 వలనే జగన్ మూడు కార్పొరేషన్లు తీసుకొచ్చారు.మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్కరికి రుణం ఇవ్వలేదు అని విమర్శించారు. 2018 లో సుప్రీం కోర్టులో ఒక కేసు విషయంలో ఎస్సీ, ఎస్టీ చట్టం లోని కొన్ని సెక్షన్లు తొలగించేలా తీర్పు ఇచ్చినప్పుడు పోరాడింది టిడిపి.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలి అని మొదట మాట్లాడింది చంద్రబాబు. అసెంబ్లీ లో తీర్మానం
చేసి కేంద్రానికి పంపాం. ఎస్సీ ప్రజాప్రతినిధులను రాష్ట్రపతి వద్దకు పంపి పోరాడింది టిడిపి. కేసులో ఇంప్లీడ్ అయ్యి ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని యధాతథంగా ఉండేలా పోరాడింది టిడిపి మాత్రమే.
ఆ రోజు ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యం అవుతుంటే జగన్ కనీసం నోరెత్తి మాట్లాడలేదు. తీర్మానం చేస్తుంటే అసెంబ్లీ కి జగన్ రాలేదు.
నేను నా జీవితంలో మొదటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఒక దళిత యువతీ కుటుంబానికి న్యాయం చెయ్యమని పోరాటం చేసినందుకు.
గుంటూరులో రమ్య అనే దళితయువతిని ఒక మృగాడు నడి రోడ్డు మీద హత్య చేసాడు. ఆ కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగినందుకు నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి 5 లక్షలు సాయం చేసాం. న్యాయ పోరాటానికి కూడా సాయం చేసాం.
అమరావతి దళిత రైతుల కోసం పోరాడినందుకు రెండో సారి స్టేషన్ కి వెళ్ళాను అని లోకేష్ వివరించారు. కావాలి లో వైసిపి నాయకులు వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే టిడిపి ఆదుకుంది. 15 లక్షల ఆర్ధిక సాయం అందించి తనఖాలో ఉన్న ఇల్లు విడిపించి కుటుంబానికి అందజేసాం.
దళిత యువతి స్నేహాలతను చంపేస్తే పోరాడింది టిడిపి. రెండు లక్షల ఆర్ధిక సాయం అందించాం.
రేపల్లె రైల్వే స్టేషన్ లో ఒక దళిత మహిళ పై అత్యాచారం జరిగితే ఆమె న్యాయం చెయ్యాలి అని పోరాడింది టిడిపి. ఆమె కు రెండు లక్షల ఆర్ధిక సాయం చేసింది టిడిపి అని చెప్పారు.
లబ్దిదారులను ఆదుకుంటాం ఎన్ఎస్ఎఫ్డీసి పథకం ద్వారా ఇన్నోవాలు, జేసిబిలు పొందిన వారు జగన్ పాలన లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలన, కరోనా కారణంగా ఇబ్బంది పడిన లబ్దిదారులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటాం.స్మశానం భూములు లేవని ఎంతో మంది నా దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల స్మశానం కోసం భూములు కేటాయిస్తాం. మౌలిక వసతులు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రమణ్యం ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సన్మానం చేసి పాలాభిషేకం చేశారు.
సుబ్రమణ్యం కుటుంబానికి 5 లక్షల ఆర్ధిక సాయం చేసింది టిడిపి. పోరాడిన మా ఎస్సీ నాయకుడు ఎంఎస్ రాజు, దళిత నాయకుల పై లాఠీ ఛార్జ్ చేయించింది జగన్ ప్రభుత్వం.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల లో దళిత మహిళ నాగమ్మను కిరాతకంగా హత్యచేస్తే టిడిపి నాయకులు పోరాడారు. పోరాడిన ఎస్సీ నాయకులు ఎంఎస్ రాజు, అనిత గారి పైనే ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు.
టిడిపి హయాంలో 3 వేల ఎకరాలు భూమి కొనుగోలు చేసి మరీ దళితులకు ఇచ్చాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు భూమి కేటాయింపు కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తామని వెల్లడించారు. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. విదేశీ విద్య పథకం కి అంబేద్కర్ పేరు తొలగించడం దుర్మార్గం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. జగన్ పేరు తొలగించి అంబేద్కర్ గారి పేరు పెడతాం.
దళితుల పై అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీని పై విచారణ చేసి అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకుంటామని హామీ యిచ్చారు.
సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరిస్తాం
టిడిపి పరిపాలనలో ఎప్పుడూ ఎస్సీల పై దాడులు జరగలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎస్సీలకు అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అమలు చేస్తాం. దళితులకు టిడ్కో
ఇళ్లు కేటాయిస్తాం.
టిడిపి హయాంలో ఎస్సీ ల కోసం 40 వేల కోట్లు ఖర్చు చేసాం. జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.
ఎస్సీలకు 100 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్
ఇచ్చాం. దళితులు అంతా ఎవరి హయాంలో న్యాయం జరిగిందో అర్దం చేసుకోవాలి అని లోకేష్ కోరారు. కోడుమూరు నియోజకవర్గం లో టిడిపి నలభై ఏళ్లుగా గెలవలేదు. ఈ సారి టిడిపి ని గెలిపించండి
కోడుమూరు కి అభివృద్ది ని పరిచయం చేస్తామని వెల్లడించారు.