టిడిపి అధికారంలోకి వచ్చాక వక్కెరవాగుపై పటిష్టమైన బ్రిడ్జిని నిర్మించి నెరవాడ గ్రామస్తుల సమస్య పరిష్కరిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం
పాదయాత్రలో భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గం నెరవాడ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు.
మా గ్రామం నుండి కర్నూలుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
చిన్న వర్షానికే వక్కెరవాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి.
ఉపాధికోసం వాగుదాటే క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
2020లో ఒకరు మృతి, ఇద్దరు గల్లంతయ్యారు. 2022లో ఒకరు మృతిచెందారు.
ఈ కుటుంబాలకు నేటికీ ప్రభుత్వం ఎటువంటి పరిహారం అందించలేదు.
వాగు పొంగినపుడల్లా మా గ్రామ ప్రజలు అన్ని విధాలా నష్టపోతున్నారు.
వక్కెరవాగు ఎత్తును పెంచి బ్రిడ్జి నిర్మించి మా గ్రామ సమస్యను పరిష్కరించండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, బ్రిడ్జిల నిర్వహణను గాలికొదిలేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి, 61నిండుప్రాణాలు బలయ్యాయి.
నెరవాడ నుంచి కర్నూలు వెళ్లే రహదారిని నిర్మించి, రాకపోకల సమస్య పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, బ్రిడ్జిల నిర్వహణను గాలికొదిలేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి, 61నిండుప్రాణాలు బలయ్యాయి.
నెరవాడ నుంచి కర్నూలు వెళ్లే రహదారిని నిర్మించి, రాకపోకల సమస్య పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.