టిడిపి అధికారంలోకి వచ్చాక వాస్తవ భూ అనుభవదారులను గుర్తించి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
భూఆక్రమణల దారులపై ఉక్కుపాదం మోపి, రైతుల భూములకు రక్షణ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం కైరవాడి గ్రామ రైతు శ్రీనివాసులు భూరక్ష సర్వే పేరుతో ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు.
వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూరక్ష సర్వే పథకం రైతుల పాలిట శాపంగా మారింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల మధ్య ఈ పథకం చిచ్చుపెడుతోంది.
భూసర్వేలో లోపాలు రైతులపాలిట శాపాలుగా మారాయి.
రైతులు పనులు మానేసి ఎమ్మార్వో, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
రైతుల మధ్య చిచ్చుపెట్టే ఈ పథకాన్ని మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేయాలి అనివారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
బాబాయ్ హత్యకేసులో రేపో, మాపో జైలుకు వెళ్లబోతున్న జగన్ కు రాష్ట్రంలో ఏఒక్కరూ ప్రశాంతంగా ఉండటం ఇష్టంలేదు.
భూరక్ష పేరు పథకం రైతుల భూములు కొట్టేసే భూభక్ష పథకంగా మారిపోయింది.
వైసీపీ తెచ్చే ప్రతి స్కీం వెనుక భారీ స్కాం ఉంటోంది. భూములకు ఏర్పాటుచేసే హద్దురాళ్లలో సైతం జగన్ అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు.