టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నందికొట్కూరు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు కలిసి వారి సమస్యలపై విన్నవించారు.
మైనారిటీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి.
గత ప్రభుత్వంలో అమలు చేసిన దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించాలి.
పేద ముస్లింలు ఉన్నత విద్యను అభ్యసించ లేకపోతున్నారు. వారికి ఆర్థిక చేయూతనివ్వాలి.
మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం స్వాహా చేస్తోంది.
గత ప్రభుత్వం ఇచ్చిన రోషిణి, దుకాన్-మకాన్ పథకాలు నేడు రావడం లేదు.
జగన్ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై వేధింపులు అధికమయ్యాయి.
ముస్లింలకు కేజీ టు పీజీ వరకు మైనారిటీ విద్యార్థులకు ఉచితవిద్యనందించాలి.
పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో హజ్ యాత్రకు పంపించాలి.
మీరు అధికారంలోకి వచ్చాక మైనారిటీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి అనివారు విజ్ఞప్తి చేశారు.
వారి వినతులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గమూ ప్రశాంత జీవనం గడిపే పరిస్థితులు లేవు.
తాలిబాన్ తరహా పాలన కొనసాగిస్తూ మైనారిటీలకు నరకం చూపిస్తున్నారు.
తాజాగా మదనపల్లిలో మైనారిటీ యువకుడు అక్రమ్ ను పులివెందుల బ్యాచ్ అన్యాయంగా పొట్టనబెట్టుకుంది.
వైసీపీ నాయకులు వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బ ఆత్మహత్య చేసుకున్నారు.
మసీదు ఆస్తుల రక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు.
మైనారిటీల సబ్ ప్లాన్ నిధులు రూ.5,400 కోట్ల దారిమళ్లించి ముస్లింలకు అన్యాయం చేశారు.
పూర్తి ప్రభుత్వ ఖర్చులపై పేద ముస్లింలను హజ్ యాత్రకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.