టిడిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజి వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం గార్గేయపురం గ్రామస్తులు నారా లోకేష్ ను కలసి సమస్యలపై విన్నవించారు.
మా గ్రామంలో డ్రైనేజీలు సమస్య అధికంగా ఉంది.సిసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేదు.
మురుగునీరు ఇళ్లలోకి వస్తోంది. దోమల బెడద అధికంగా ఉంది.
వీధి దీపాలు చెడిపోవడంతో రాత్రిపూట తిరగడం ఇబ్బందిగా ఉంది.
వైసీపీ నాయకులు ఎవరూ మా సమస్యల్ని పట్టించుకోవడం లేదు.
మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్ అండో కో కు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ గ్రామాల అభివృద్ధిపై లేదు.
వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి కుంటుపడింది.
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు.
వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయి ఇచ్చి, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.