టిడిపి ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అండగా నిలుస్తాం, నష్టపోయిన రైతాంగానికి ఆదకుంటాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర
సందర్భంగా బుధవారం కోసిగి శివార్లలో మోహన్, శ్రీరామ్ అనే బొప్పాయి రైతులను లోకేష్ కలసి వారి కష్టాలను తెలుసుకున్నారు.తాము చెరో నాలుగు ఎకరాలు పొట్టి బొప్పాయి వేస్తే, ఒక్కొక్కరికి 8లక్షలు నష్టం వచ్చింది.
ఇటీవల ఈదురుగాలులు, అకాలవర్షాలకు చెట్లు దెబ్బతిన్నాయి, కాయలు నేల రాలాయి.
అధికారులు వచ్చి పంటను పరిశీలించాలని కోరితే, పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తెండి రాస్తామన్నారు.పంట పరిశీలించకుండా నష్టం ఎలా అంచనా వేస్తారని అడిగితే ఇష్టమైతే మేం అడిగిన వివరాలు తెండి, లేకపోతే మానుకోండని ఆర్ బికెలో సమాధానమిచ్చారు.రెండనెలలైనా ఇంతవరకు ఎవరు పంటను పరిశీలించడానికి రాలేదు. నీళ్లులేకపోతే పులికనుమ నుంచి 10లక్షలు ఖర్చుపెట్టి 4కి.మీ పైపులు వేసి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చింది.గతంలో ఇరుగుపొరుగు వారు బొప్పాయి వేస్తే లాభాలు వచ్చాయని చెబితే మేం ఈ పంట ఎంచుకున్నాం.
ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే వ్యవసాయం చేయలేం అని వారు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
వారి సమస్యపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను నట్టేట ముంచాడు.
సొంతంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదు.
ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు.
టిడిపి ప్రభుత్వ హయాంలో డ్రిప్, ఇన్ పుట్ సబ్సిడీ, పంటనష్టపోతే సకాలంలో క్రాప్ ఇన్సూరెన్స్ అందజేశాం.
జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ప్రతిరైతుపైన సగటు రూ.2.5లక్షల అప్పుతో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉన్నారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.