టిడిపి అధికారంలోకి రాగానే తుంగభద్ర ఎల్ఎల్ సి కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టి సాగు, తాగునీటి సమస్యను నివారిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం గోనెగండ్లలో టిడిపి నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికారు.
నారా లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలపైకి ఎక్కిన చూశారు. తనిని కలవడానికి వచ్చిన వారందరితో ఫోటోలు దిగుతూ వారి వద్ద ఆగి లోకేష్ సమస్యలు
తెలుసుకున్నారు. గోనెగండ్ల గ్రామానికి 4రోజులకు ఒకసారి తాగునీరు వస్తోంది. దీంతో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నాం.
గత ప్రభుత్వంలో ఆర్ డిఎస్ కుడికాల్వ పనులు ప్రారంభిస్తే, ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
తుంగభద్ర ప్రాజెక్టుపైన కర్నాటక అప్పర్ భద్ర కడుతున్నా వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని వారు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాయలసీమ బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందజేయకపోవడం సిగ్గుచేటు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.1986 కోట్లతో ప్రారంభించిన ఆర్ డిఎస్ కుడికాల్వ పనులను అధికారం చేపట్టాక మేమే పూర్తిచేస్తామని వెల్లడించారు.