టిడిపి అధికారంలోకి వచ్చాక తుంగభద్ర నీటితోపాటు ఇంటింటికీ కుళాయి అందజేస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా
శుక్రవారం పాణ్యం నియోజకవర్గం పెదపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గతంలో మా గ్రామానికి ఆర్.డబ్ల్యూ.ఎస్ ద్వారా
తుంగభద్ర నీటిని గత అందించారు.
2018 వరకు తుంగభద్ర నీరు మా గ్రామానికి అందింది.
2019లో కార్పొరేషన్లో చేర్చిన తర్వాత నీరు సరిపడా రావడం లేదు.
మా గ్రామంలో 3ట్యాంకులు, వాటికి పైపు లైన్లు ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీరు వస్తోంది.
మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్య పరిష్కరించండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
కేవలం పన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలను విలీనం చేశారు.
ఆస్తిపన్ను, విలువ ఆధారిత ఇంటిపన్నులు, నీటి కుళాయి పన్ను, చెత్త పన్ను అంటూ రకరకాల పన్నులతో అమాయకులను దోచుకుంటున్నారు.
కార్పొరేషన్ లో కలిపితే సౌకర్యాలు మెరుగుపడాలే తప్ప ఉన్న సౌకర్యాలు దెబ్బతీయడమేమిటి?అని లోకేష్ ప్రశ్నించారు.