టిడిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ కాలనీలను అభివృద్ధి చేస్తాం. దేవనకొండలో దళితులకు కమ్యూనిటీ హాలు, ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేపడతాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఆలూరు నియోజకవర్గం దేవనకొండ దళితులు లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మండల కేంద్రం దేవనకొండ ఎస్సీ కాలనీలో 600 కుటుంబాలున్నాయి. శుభకార్యాలు చేసుకునేందుకు కమ్యూనిటి హాలు ఏర్పాటుచేయండి.
దేవనకొండలో ఎస్సీ, బీసీ హాస్టళ్లులేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీ బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఎస్సీలకు చెందాల్సిన రూ.28,149కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో దళితులకు అమలుచేసిన 27సంక్షేమ పథకాలు రద్దుచేశారు. గత టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాం అని వివరించారు.