టిడిపి అధికారంలోకి వచ్చాక ఫ్లెక్సీలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం జారీచేసిన జిఓలను రద్దుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో శుక్రవారం ప్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్ ను కలిసి వారి సమస్యల పై విన్నవించారు. ప్లెక్సీ ప్రింటింగ్ పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన జిఓ నెం. 65,75లను రద్దు చేయాలి.
ప్రభుత్వ నిబంధనల మేరకే మేము ప్లెక్సీలు ప్రింట్ చేస్తున్నాం.
మేము ముద్రించే ప్లెక్సీలు 180 మైక్రాన్ ల పరిమాణంలో ఉంటాయి.
ప్లెక్సీ ప్రింటింగ్ వృత్తిని కుటీర పరిశ్రమగా గుర్తించి, ప్రభుత్వ రాయితీలు అందించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రిగా జగన్ కు కొత్తగా ఉద్యోగాలివ్వకపోగా, ప్లెక్సీ ప్రింటింగ్ పై నిషేధం విధిస్తూ జిఓలు తెచ్చి లక్షలాదిమంది పొట్టగొట్టే ప్రయత్నం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఫ్లెక్సీలను బ్యాన్ చేయడం దారుణం.
నిబంధనలకు లోబడి ఏర్పాటుచేసుకునే ఫ్లెక్సీ
ప్రింటింగ్ యూనిట్లకు సహకారం అందిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.