టిడిపి అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా, పందికోన రిజర్వాయ్ నుండి రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఆలూరునియోజకవర్గం, గద్దెరాళ్ల గ్రామస్తులు లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలో రైతులు కాలువలు,పిల్లకాలువలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామం మీదుగా 8 గ్రామాల ప్రజలు తిరుగుతుంటారు. మా గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు. కర్నూలు-బళ్లారి హైవే దగ్గర మా గ్రామంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలి.
గద్దెరాళ్ల మారెమ్మ దేవస్థానం పునరుద్ధరణ చేయాలి అని వారు కోరారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్ పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయారు. రైతులకు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను నిలిపేశారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేవు. రోడ్లు నిర్మాణాలు లేవు. గ్రామాల్లో అవసరమైన రోడ్లు నిర్మిస్తాం. అవసరమైన ప్రదేశాల్లో బస్టాండ్ నిర్మిస్తాం. గద్దెరాళ్ల మారెమ్మ దేవాలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.