టిడిపి అధికారంలోకి రాగానే అన్ని నియోజకవర్గాల్లో నీరా కేఫ్ లు ఏర్పాటుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం కోడుమూరు నియోజకవర్గం నందనపల్లి ఈడిగ సామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
1997లో గీత కార్మికుల ఉపకులాలన్నింటినీ ఒకటిగా చేస్తూ జిఓ నెం.16ను విడుదలచేశారు.
మా ఐదు ఉపకులాలకు ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
గీత కార్మికుల కార్పొరేషన్ కు రూ.100కోట్లు కేటాయించాలి.
ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.20లక్షలు పరిహారం ఇవ్వాలి.
మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 30శాతం కేటాయించాలి.
ఈత, తాటి, కర్జూర మొక్కలు ఇచ్చి ఉచితంగా బోర్లు ఏర్పాటుచేయాలి.
టీఎఫ్ టి లైసెన్సులు మంజూరు చేయాలి, నీరా కేఫ్ లు ఏర్పాటుచేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
కులాల మధ్య గొడవలు సృష్టించి చలికాచుకోవడం జగన్మోహన్ రెడ్డి నైజం.
విధులు, నిధులు లేని కార్పొరేషన్లతో బీసీలను జగన్ మోసం చేశాడు.
ఆదరణ పథకం రద్దు చేసి బీసీలకు తీరని ద్రోహం చేశాడు.
టిడిపి అధికారంలోకి వచ్చాక గీతకార్మికులకు ఉపాధి హామని అనుసంధానం చేస్తాం.
మద్యం షాపుల్లో గీత కార్మికులకు రిజర్వేషన్ అమలుచేస్తాం.
గౌడ, ఈడిగ ఉపకులాల మధ్య అంతరాన్ని తొలగించి ఏకతాటిపైకి తెస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.