టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం
చేనేతను దత్తత తీసుకుంటా… సమస్యలన్నీ పరిష్కరిస్తా
చేనేత వస్త్రాలపై జిఎస్టీని ప్రభుత్వమే భరించేలా చేస్తాం
ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్
…….
తల్లి, చెల్లిని రోడ్డు మీదకి గెంటేసిన జగన్. తల్లి లాంటి కడప జిల్లాకు కూడా తీరని అన్యాయం చేశాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో చేనేత కార్మికులతో యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ పాలనలో చేనేత కార్మికులు బాధితులు, కనీసం చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందుల పై సమీక్ష చేసే తీరిక కూడా జగన్ కు లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా చేనేత ను నేను దత్తత తీసుకుంటున్నాను. చేనేత పై ఉన్న 5 శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం.
చంద్రన్న భీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతాం. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మగ్గాల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం నుండి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ అందజేస్తామని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడిన రంగులు అద్దే కార్మికుల దగ్గర నుండి మాస్టర్ వీవర్ వరకూ అందరిని ఆదుకుంటాం. చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక బ్రాండింగ్ ఏర్పాటు చేస్తాం. జగన్ పరిపాలనలో చేనేత ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గిస్తాం. నేతన్న నేస్తం అందరికీ ఇస్తానని చెప్పి ఇప్పుడు కేవలం సొంత మగ్గం ఉంటేనే ఇస్తానని కండిషన్స్ పెట్టాడు జగన్. టిడిపి హయాంలో ఏడాదికి అన్ని సబ్సిడీలు కలిపి ఏడాదికి నేతన్నకి సుమారుగా రూ.50 వేలు లబ్ది చేకూరింది. ఇప్పుడు జగన్ పాలనలో కనీసం మేము చేసిన దాంట్లో 10 శాతం కూడా ఇవ్వలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
చేనేతల సమస్యలపై అవగాహన ఉంది
చేనేత కార్మికుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని లోకేష్ చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకుంది టిడిపి. పద్మశాలి సామాజిక వర్గాన్ని ఆర్దికంగానూ, రాజకీయంగానూ ఆదుకుంది టిడిపి. జనతా వస్త్రాల పథకంతో చేనేత కు చేయూత ఇచ్చింది అన్న ఎన్టీఆర్. రూ.110 కోట్ల రుణమాఫి చేసింది టిడిపి. యార్న్, కలర్, పట్టు సబ్సిడీ లు ఇచ్చింది టిడిపి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత సబ్సిడీలు ఎత్తేసారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకి ఒక్క రూపాయి జగన్ ప్రభుత్వం సాయం చెయ్యలేదు. ఆప్కో ని నిర్వీర్యం చేసారు. ఆప్కో చేనేత కార్మికులందరికీ బకాయి పడింది. టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు క్లస్టర్స్ ఏర్పాటు చేశాం. నైపుణ్య శిక్షణ తో పాటు మగ్గం కొనుక్కోడానికి సాయం అందించాం. సబ్సిడీ లో చేనేత కార్మికులకు అనేక పరికరాలు అందించాం. జగన్ ప్రభుత్వం చేనేత కార్మికులకు సబ్సిడీ రుణాలు, పరికరాలు ఇవ్వడం లేదన్నారు.
ముఖాముఖి సమావేశంలో చేనేతల అభిప్రాయాలు
దేవగుడిలో చేనేతలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పలువురు చేనేతలకు తమ అభిప్రాయాలను యువనేత లోకేష్ ముందుంచారు. శ్రీనివాసులు మాట్లాడుతూ టెక్స్ టైల్ పార్క్ లో కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు రావడం లేదన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. షెడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదని తెలిపారు. రామచంద్ర మాట్లాడుతూ లో ఓల్టేజ్ కారణంగా ఇబ్బంది పడుతున్నాం.
మా ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతుందని చెప్పారు. నాగ లక్ష్మయ్య మాట్లాడుతూ చేనేతపై ఆధారపడిన అనేక రంగాల వారు ఉన్నారు. కేవలం నేత నేసే వారికి మాత్రమే సాయం అందిస్తున్నారు. అది కూడా అరకొరగా సొంత మగ్గం ఉన్న వారికే ఇస్తున్నారని అన్నారు. షరీఫ్ మాట్లాడుతూ అన్ సీజన్ లో మాకు ఉపాధి ఉండటం లేదు. వైసిపి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సబ్సిడీ రుణాలు అందడం లేదని చెప్పారు. సురేష్ మాట్లాడుతూ చేనేత ముడి సరుకుల రేట్లు జగన్ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తిరుమల్ దాస్ మాట్లాడుతూ జీఎస్టీ చేనేత కు పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.