టిడిపి అధికారంలోకి రాగానే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారంనందికొట్కూరు నియోజకవర్గం బన్నూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో గ్రామంలో తాగు, సాగునీటితోపాటు ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంది. రక్షిత
మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
మా గ్రామంలో వీధిదీపాలు సరిగా వెలగడంలేదు.
మా గ్రామానికి ఆర్టీసి బస్ సౌకర్యం కల్పించాలి.
డ్రైన్లు లేకపోవడంతో వర్షపునీరు రోడ్లపైకి వచ్చి అనారోగ్యానికి గురవుతున్నాం. డ్రైనేజీలు నిర్మించాలి.
రైతులకు మేలైన విత్తనాలు, ఎరువులు, పురుమందులు సరఫరా చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.
గ్రామపంచాయితీల నిధులు రూ.8600కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం దొంగిలించింది.
దీంతో పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధుల్లేక ఇబ్బంది పడుతున్నారు.
సర్పంచ్ లు సొంత డబ్బులతో పనులుచేసి, బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
బన్నూరు గ్రామానికి ఆర్టీసి బస్ సౌకర్యం కల్పిస్తాం.
రైతులకు ఎపి సీడ్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందజేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.