టిడిపి అధికారంలోకి వచ్చాక మాదిగ, ఉపకులాలకు న్యాయం జరిగేలా దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్ర సందర్భంగా బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గం నరసింహాపురంలో ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
దళితుల్లో అనేక ఉపకులాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందక వెనుకబడి ఉన్నారు. మాదిగలతోపాటు ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి వర్గీకరణే ఏకైక మార్గం. 2000 నుంచి 2004వరకు అప్పటి టిడిపి ప్రభుత్వం వర్గీకరణ అమలుచేయడం వల్ల 24వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి, పార్లమెంటులో బిల్లు పెట్టించేందుకు చొరవచూపాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో రూ.28,147 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన దళితులను జగన్ ప్రభుత్వం రాజ్యహింసకు పాల్పడుతోంది. వర్గీకరణ విషయంలో మాదిగల సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది అని వారికి లోకేష్ హామీ
ఇచ్చారు