టిడిపి అధికారంలోకి రాగానే బుడగజంగాలకు సబ్సిడీ రుణాలు అందజేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్రలో భాగంగా శనివారం బనగానపల్లి ఓకమిట్ట జంక్షన్ లో బుడగజంగాల ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా పిల్లలకు చదువుల విషయంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, మా పరిస్థితి ఘోరంగా ఉంది. సర్టిఫికెట్లు లేవని మా పిల్లల్ని స్కూళ్లలో చేర్చుకోకపోవడంతో భిక్షాటన చేస్తున్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు.
ఏపీలోనూ మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాక్షసానందం పొందడం జగన్ నైజం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బేడ, బుడగజంగాల కులధృవీకరణ పత్రాల సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తాం.
బేడ, బడగ జంగాల పేదవిద్యార్థులకు బెస్ట్ అవైలబులబుల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.