టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వం అమాయకులపై బనాయించిన తప్పుడు కేసులను ఎత్తేస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం నందికొట్కూరు నియోజకవర్గం తర్తూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
మా గ్రామంలో 2,200 జనాభా ఉన్నారు. గ్రామానికి తూర్పువైపున 3,500 ఎకరాల పొలాలు ఉన్నాయి.
మీ ప్రభుత్వం వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరుచేసి మా పొలాలకు నీరందించండి.
మా గ్రామంలో ప్రతి ఏటా ఏప్రిల్ లో 20రోజులపాటు జాతర జరుగుతుంధి. జాతరలో తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నందున పరిష్కారం చూపండి.
మా గ్రామంలోని మహమ్మద్ కుంటలో అధికారపార్టీ నాయకులు అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపట్టడంతో ఇబ్బందిగా ఉంది.
అఢ్డుకుంటే కేసులు పెడుతున్నారు.మా గ్రామ వైసిపి నాయకుడు, సర్పంచ్ మేనమామ టిటిడి ఈఓగా పనిచేస్తున్నారు. ఆయన అండదండలతో అధికారాన్ని ఉపయోగించి మాపై అక్రమ కేసులు
బనాయిస్తున్నారు.
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మాపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొండలు, గుట్టలు, వాగులు, వంకలన్నీ మాయమై పోతున్నాయి.
అక్రమ గ్రావెల్ తవ్వకాలతో అడ్డగోలుగా దోచుకోవడం, అడ్డువచ్చిన వారిపై తప్పుడు కేసులు మోపడం ఈ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారాయి.
బాధితులపైనే ఎదురుకేసులు పెట్టడం రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రత్యేకత.
తర్తూరు గ్రామంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.