టిడిపి అధికారంలోకి రాగానే రాయలసీమ రైతాంగానికి గతంలో అమలుచేసిన సబ్సిడీ డ్రిప్ పథకాన్ని పునరుద్దిరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం నందికొట్కూరు నియోజకవర్గం తాటిపాడు రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
మొక్కజొన్న, ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
నకిలీవిత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి.
అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం ఆదుకోవాలి.
రైతులకు వడ్డీలేని రుణాలను అందించాలి. బ్యాంకులనుంచి రైతులపై వత్తిడి తగ్గించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వ్యవసాయంపై అవగాహన లేని జగన్ అన్నదాతలను నట్టేట ముంచాడు.
జగన్ నిర్వాకం కారణంగా జాతీయస్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో 3వస్థానం, అప్పుల్లో మొదటిస్థానానికి చేరుకుంది.
టిడిపి హయాంలో రైతుల సగటు అప్పు రూ.70వేలు ఉంటే, ప్రస్తుతం 2.5లక్షలకు చేరింది.
జగన్ పాలనలో నకిలీవిత్తనాల మాఫియా పేట్రేగి పోతోంది. టిడిపి అధికారంలోకి వచ్చినవెంటనే నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం.
అధికారంలోకి వచ్చాక ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతాం.
ఎపి సీడ్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తాం.
మొక్కజొన్న, ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.