టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామంలో డ్రైనేజి, ఇతర సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గం కల్లుదేవకుంట గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న సిమెంటు రోడ్లు మీ హయాంలో నిర్మించినవేనని యువనేతకు చూపి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు.
మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు చేయాలి.
సాగునీటి సమస్య పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలి.
మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటుచేయాలి.
పిహెచ్ సిలో డాక్టర్, రెగ్యులర్ స్టాఫ్ ను నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
గ్రామపంచాయితీలకు చెందిన రూ.8660 కోట్లు దొంగిలించారు.
నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాను.
టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.