టిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లిరైతులను ఆదుకుంటాం. ప్రతి పంటకు కనీస మద్దతు ధర అందిస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర
సందర్భంగా మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం కైరవాడి గ్రామ ఉల్లి రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
మా గ్రామంలో దాదాపు 4వేల ఎకరాల వ్యవసాయ భూమిలో 75శాతం ఉల్లి పంట పండిస్తున్నాం.
జిల్లాలో ఉల్లి పంటలో మా గ్రామం మొదటిస్థానంలో ఉండేది.
గత నాలుగేళ్లుగా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాయం.
ఈ సంవత్సరం ఉల్లి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించాం.
గత ప్రభుత్వంలో ఉల్లి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకునేది. వైసీపీ వచ్చాక మా వద్ద పంట కొనుగోలు చేయడం లేదు.
దీంతో ఉల్లి రైతులంతా అప్పుల్లో మునిగిపోయారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక ఉల్లికి కనీస మద్దతు ధర రూ.2వేలు ప్రకటించి ఆదుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
బాబాయ్ ని లేపేసిన కేసులో బెయిలో, జైలో తెలియక ముఖ్యమంత్రి కొట్టుమిట్టాడు.
రాష్ట్రంలో రైతాంగాన్ని ముఖ్యమంత్రి గాలికొదిలేశారు.
వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేని సిఎం జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి జగన్ అసమర్థత, చేతగానితనం కారణంగా నాలుగేళ్లలో రాష్ట్ర రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
జగన్ నిర్వాకం వల్ల 3వేల మంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యలో 2వ స్థానం, అత్యధికంగా అప్పులున్న రైతుల్లో 1వ స్థానంలోకి చేర్చారు.
రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి పత్తాలేకుండా పోయారు.
రైతుల నుండి ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.