- యువనేత చేతులమీదుగా యూరోకార్టుల పంపిణీ
- మంగళగిరిలో చిరువ్యాపారులకు మరోవరం
- తొలుత పైలెట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో
- విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు
మంగళగిరి: టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరువ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దుచేస్తా మని యువనేత లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిరు వ్యాపా రుల జీవనోపాధికి ఇప్పటికే వివిధ రూపాల్లో చేయూతనిస్తున్న యువనేత నారా లోకేష్ బుధ వారం మరోపైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఎన్ఆర్ఐ టీడీపీ సహకారంతో చిరువ్యాపారుల ఆదాయాన్ని కనీసం 50శాతం పెంచేదిశగా అధు నాతన యూరోకార్టు సేవలను లోకేష్ ప్రారంభిం చారు. రోడ్లవెంట టిఫిన్ బండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు పాశ్చాత్య దేశాల్లో మాదిరి అధునాతన సదుపాయాలతో కూడిన యూరోకార్టు (అధునాతన తోపుడుబండ్లు)లను యువనేత అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం పేరుతో కుడి చేత్తో రూ.10 ఇచ్చి, ఎడమచేత్తో రూ.100 లాగేస్తున్నారని అన్నారు.
వీధి వ్యాపారు లకు వడ్డీలేని రుణాల పేరుతో 10వేలు ఇస్తున్నా రని, ఇదే సమయంలో ఆశీలు పేరుతో ఏటా రూ.10,800 లాగేస్తున్నారని తెలిపారు. చిరు వ్యాపారులు ఎక్కడైతే రోజువారీ బళ్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారో, వారికి అక్కడే లైసెన్సులు ఇచ్చి పోలీసు వేధింపులు లేకుండా చేస్తామని తెలిపారు. చిరువ్యాపారుల బళ్లవద్ద చెత్తను మున్సి పాలిటీల ద్వారా సేకరించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. యూరోకార్టులు పొందిన లబ్ధి దారులకు బ్యాంకుద్వారా వర్కింగ్ క్యాపిటల్ సమకూరుస్తున్నందున అడ్డగోలు వడ్డీల బెడద ఉండదని తెలిపారు. శుభ్రత విషయంలో 5 స్టార్ హోటల్స్‌కి దీటుగా వెస్టిన్ హోటల్ మేనేజ్ మెంట్ స్కూల్ ప్రతి నిధులతో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ అధునాతన యూరోకార్టుల వల్ల చిరువ్యాపారుల ఆదాయం 50 శాతం వరకు పెరుగుతుందని లోకేష్ అన్నారు.
యూరోకార్టుల ప్రత్యేకతలివే!
అధునాతంగా రూపొందించిన యూరోకార్టు లు తేలికగా శుభ్రం చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. శుభ్రత విషయంలో వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ప్రతినిధులు ముందుగా చిరు వ్యాపారులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. చిరు వ్యాపారులకు అవసరమైన రోజువారీ సరుకులను ఆర్డర్‌పై వేర్వేరు బ్రాండెడ్ స్టోర్స్.. బండి దగ్గరకే పంపేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఈ లావాదేవీలకి అవసరమైన బ్యాంకు సేవలను హెచ్డీఎఫ్సీ బ్యాంకు అందిస్తుంది.రోజువారీ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతోపాటు యూరోకార్టు స్క్రీన్‌పై ప్రకటనల ద్వారా కూడా మరికొంత ఆదాయం లభించే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐ టీడీపీకి చెందిన ప్రవాస భారతీయుడు గుంటుపల్లి జయ కుమార్, మురళి రాపర్ల సహకారంతో బుధవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ఇంటివద్ద యువనేత నారా లోకేష్ చేతులమీదుగా ఈ పైలట్ ప్రాజెక్టు ను ప్రారంభించారు.
చిరువ్యాపారుల ఆదాయం తోపాటు జీవనప్రమాణాలు పెంచడానికి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం.. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే ప్రజాప్రభుత్వంలో దీనిని రాష్ట్రస్థాయిలో విస్తరించాలని భావిస్తున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. మొదటి దశలో భాగం గా మంగళగిరి నియోజకవర్గంలో 50 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి యూరోకార్టులు అంద జేసారు. అందులో కొంత మంది లబ్ధిదారులకు లోకేష్ స్వయంగా తన నివాసం వద్ద యూరో కార్టులు అందజేసారు. తమ కుటుంబ పోషణకు యూరో కార్టులు ఎంతగానో ఉపయోగపడతాయి అని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహి ళలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త నందం అబద్దయ్య, ఇతర ముఖ్య నేతలు, ఎన్ఆర్ఐ టీడీపీకి చెందిన గుంటుపల్లి జయకుమార్, మురళీ రాపర్ల, యూరో కార్ట్ డిజైనర్ కృష్ణం రాజు, వెస్ట్ఇన్ ట్రైనర్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.