టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్టీలకు భూములను అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం
నందికొట్కూరు నియోజకవర్గం కోళ్లబావాపురం ఎస్టీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
మా గ్రామంలో 150 ఎస్టీ కుటుంబాలు జీవిస్తున్నాం.
మా గ్రామంలో ఎస్టీ యువకులు ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారు.
ఎస్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలి.
మేం వ్యవసాయం చేసుకోవడానికి భూములు కేటాయించాలి.
ఇళ్లు లేనివారి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. అర్హులైన ఎస్టీలకు పింఛన్లు మంజూరు చేయాలి అనివ్ ఆరు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక రూ.5,355 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు.
ఎస్టీల స్వయం ఉఫాధికి గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను నిర్వీర్యం చేశారు.
ఇళ్లులేని వారికి పక్కా ఇళ్లు, పెన్షన్లు అందజేస్తాం.
ఎస్టీ కార్పొరేషన్ ను బలోపేత చేసి స్వయం ఉపాధి రుణాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.