జనం..జనం..జనం..ప్రభంజనం. సింహపురిలో సింహ గర్జన అదిరిపోయింది. జగన్ టీవీలో లైవ్ చూస్తున్నాడు. గంజాయి బ్రో కి హయ్ చెప్పండి. ఈ రోజు తాడేపల్లి ప్యాలస్ లో టీవీలు పగలడం ఖాయం. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం, బారా షహీద్ దర్గా ఉన్న పుణ్య భూమి నెల్లూరు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నెల్లూరు నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. నెల్లూరు నుండి మార్పు మొదలవుతుంది అని నేను జనవరి 27 నే చెప్పా. మార్పు మొదలైంది. వైసిపి జెండా పీకేసే టైం దగ్గర పడింది. నెల్లూరు జిల్లాలో యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసింది. ఈ మధ్య జగన్ ని ఒక పారిశ్రామికవేత్త కలిసారట. జగన్ ఆయన్ని మా రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చెయ్యండి అని అడిగాడట. వెంటనే ఆయన రాజధాని లేని రాష్ట్రంలో కంపెనీ ఎలా పెడతాం సార్. మీ వాళ్ళు పిలిచారని మొహమాటానికి వచ్చాను అన్నాడట. అప్పుడు జగన్ నేను ఏపీ నే దేశానికి రాజధాని చేసాను నమ్మకపోతే గూగుల్ లో కొట్టండి అని చెప్పాడట. వెంటనే పారిశ్రామికవేత్త ఫోన్ తీసి ఏపీ అని కొట్టాడట. వెంటనే గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని వచ్చిందట.
చంద్రబాబు గారి హయాంలో జాబ్ క్యాపిటల్ గా ఉన్న ఏపీ ని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేసాడు. బడిలో గంజాయి, గుడిలో గంజాయి. అందుకే జగన్ పేరు మార్చాను గంజాయి బ్రో అని ముద్దుగా పేరు పెట్టా. బైబై గంజాయి బ్రో..సేవ్ ఏపీ. ఇప్పుడు మిమ్మలని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా. సమాధానాలు కరెక్ట్ గా చెప్పాలి. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ వివేకా? పిన్ని తాళి తెంచింది ఎవరు? అబ్బాయ్ కిల్డ్ బాబాయ్. పిన్ని తాళి తెంచింది జగనే. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర. బాబాయ్ మర్డర్ కేసు లో ఏ8 ఎవరు? అవినాష్ రెడ్డి. ముందస్తు కుట్ర లో అవినాష్ పాత్ర ఉందని సీబీఐ తేల్చేసింది. ఇక ఏ9 ఎవరు? జగన్. బాబాయ్ మర్డర్ లో జగన్ పాత్ర ఉంది. ఆయన్ని కూడా ప్రశ్నించాలి అని సిబిఐ చెప్పింది. జగన్ మతం క్యాష్..జగన్ కులం క్యాష్. లక్షకోట్ల ఆస్తి ఉంది, లక్ష రూపాయల చెప్పులు వాడతాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతాడు. అయినా క్యాష్ మీద ప్రేమ చావలేదు. బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయ లో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో ప్యాలస్. అయినా జగన్ కి క్యాష్ మీద ఆశ తగ్గలేదు. సొంత పేపర్, టీవీ, సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అయినా జగన్ కి క్యాష్ మీద జగన్ కి ఆశ తగ్గలేదు. తల్లి, చెల్లి తప్ప జగన్ కి అన్నీ ఉన్నాయి అయినా జగన్ కి క్యాష్ మీద ఆశ తగ్గలేదు.
జగన్ నాలుగేళ్లుగా రాజారెడ్డి రాజ్యాంగం పవర్ ఏంటో చూపించాడు…ఇప్పుడు మనం అంబేద్కర్ గారి రాజ్యాంగం పవర్ ఏంటో చూపిద్దాం. జగన్ ది పోలీసు బలం.. మీ లోకేష్ ది ప్రజా బలం. టిడిపి తెలుగు వాడి ఆత్మగౌరవం నిలబెట్టే పార్టీ. వైకాపా గలీజు పార్టీ జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి మోసం చేసాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1)ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ ఆర్టీసి ఛార్జీలు పెంచితే బాబు గారు ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ ద్వారా అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.
బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు.
ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. నెల్లూరు సిటీ, రూరల్ రెండు కళ్లు. ఈ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేసింది టిడిపి.
నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ చెయ్యనంత అభివృద్ధి చేశారు నారాయణ గారు. మీరు ఎక్కువ పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. నారాయణ గారు ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసారు. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని దద్దమ్మ ప్రభుత్వం వైసిపిది. ఒక్క నెల్లూరు టౌన్ లోనే 43 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. రోడ్లు, సిసి రోడ్లు, తాగునీటి పధకాలు, పార్కులు, ఎల్ఈడి లైట్లు, అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసాం. నారాయణ గారు అభివృద్ధి లో మాస్టర్. నెల్లూరు జిల్లా ని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. పేరులోనే నిల్లు ఉన్న అ ‘నిల్లు’ చేసింది ఏంటి? డైలాగులు కొట్టడం తప్ప సిటీ కి సిల్లీ బచ్చా పీకింది ఏంటి? నెల్లూరు సిటీ కి వచ్చా, విఆర్సి సెంటర్ కి వచ్చా నెల్లూరు అభివృద్ది పై చర్చ కు సిద్దమా? అభివృద్ది పై చర్చకి సిద్దమా అంటే పారిపోయాడు. సిల్లీ బచ్చాకి సబ్జెక్ట్ లో హాఫ్ నాలెడ్జ్.. అవినీతి లో ఫుల్ నాలెడ్జ్.
సిల్లీ బచ్చా సిటీకి తెచ్చిన నిధులు నిల్లు…కానీ నాలుగేళ్లలో పోగేసింది ఏంతో తెలుసా? వెయ్యి కోట్లు. సిల్లీ బచ్చా భూకబ్జాల లిస్ట్, భూ దందాల మొత్తం ఈ రోజు నేను బయటపెడుతున్నా. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు. నాయుడుపేట లో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు. ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు. ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు. అల్లీపురం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి. సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు. ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవి కి కోట్ల రూపాయలు వచ్చాయి. బృందావనం లో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు. దామరమడుగు లో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేసి అమ్మేస్తున్నాడు. ఆఖరికి కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నాడు సిల్లీ బచ్చా. వ్యాపారస్తులను, ఆసుపత్రుల యజమానులు, జ్యువెలరీ షాపుల వారిని బెదిరించి కోట్లు కొట్టేసాడు.
సిల్లీ బచ్చా అండ్ కంపెనీ పెన్నా నది నుండి ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు దోచుకుంది. ఇలానే వదిలేస్తే సిల్లీ బచ్చా తనని మించిపోతాడని జగన్ కి భయం పట్టుకుంది. అందుకే సీటు చింపేసాడు. క్లారిటీ ఉంది కాబట్టే సిల్లీ బచ్చా చెన్నై లో 50 కోట్లతో ఇళ్లు కట్టాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే రాష్ట్రం నుండి పరార్. ఎక్కడ ఉన్నా సిల్లీ బచ్చా చేసిన భూ అక్రమాల పై ప్రత్యేక సిట్ వేస్తాం. నారాయణ గారు ఎక్కడ అపేశారో అక్కడ నుండి నెల్లూరు అభివృద్ధి మళ్లీ రీస్టార్ట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తాం.
నెల్లూరు టౌన్ లో స్వర్ణకారులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వర్ణకారులను ఆదుకుంటాం. స్వర్ణకారులు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. నెల్లూరు రూరల్ మాస్ లీడర్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్నా, అక్కడి ప్రజలు అన్నా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రాణం. అంతా ఆయనకి వైసిపి లో అవమానం జరిగింది కాబట్టి బయటకి వచ్చారని అనుకుంటున్నారు. రూరల్ నియోజకవర్గానికి అవమానం జరిగింది కాబట్టి ఆయన బయటకి వచ్చారు.
రూరల్ నియోజకవర్గం ప్రజల్ని జగన్ అవమానించారు కాబట్టి ఆయన బయటకి వచ్చారు. ఆయన ఫోన్ ట్యాప్ చేసారు, వ్యక్తిగత విమర్శలు చేసారు, సెక్యూరిటీ తీసేసారు, ఒక ఉగ్రవాదిని వెంటాడినట్టు ప్రభుత్వం ఆయన్ని వెంటాడుతుంది. అయినా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తగ్గలేదు ఆయన పోరాడుతున్నారు. కేవలం 10 నెలలు ఓపిక పట్టండి రూరల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చబోయేది టిడిపి. పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. ములుముడి చెరువు వద్ద ఉన్న కలుజు మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. బారా షాహిద్ దర్గా ని గతంలో అభివృద్ధి చేసింది మనమే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దర్గా ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఆమంచర్ల గ్రామం వద్ద కనుపూరు కాలువ మీద డీప్ కట్ నిర్మాణం చేసి 42 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. కోమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాలెం, దొంతాలి లిఫ్ట్ పూర్తి చేస్తాం. క్రిస్టియన్ కమ్యూనిటీ హల్, బిసి భవన్, కాపు భవన్, అంబేద్కర్ భవన్ విత్ స్టడీ సర్కిల్, మైనార్టీ గురుకుల పాఠశాల పనులు పూర్తి చేస్తాం. ఎందుకు పనికి రాని లోలెవల్ ఉన్న వావిలేటిపాడు లేఅవుట్ లో పేదలకు స్థలాలు ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం. పెండింగ్ లో ఉన్న అన్ని షాదీ మంజిల్లను పూర్తి చేస్తాం. ఆమంచర్ల గ్రామంలో ఏపీఐఐసి భూములు ఉన్నాయి. అక్కడ మైక్రో అండ్ స్మాల్ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు – గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. హరనాథపురం- మినీ బైపాస్ ని కలుపుతూ సర్వేపల్లి కాలువ మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం.జగన్ కి కష్టం వస్తే మొదట నిలబడిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని జగన్ అవమానించాడు. పెద్దాయన ఆనం రాంనారాయణ రెడ్డి గారిని జగన్ అవమానించాడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని జగన్ అవమానించాడు. నెల్లూరు జిల్లా ప్రజల్ని జగన్ అవమానించాడు. నాలుగేళ్లుగా నారాయణ గారు ఎక్కడ అని అనిల్ ప్రశ్నిస్తున్నాడు. ఆయన్ని చూస్తే జగన్ కి భయం అందుకే అనేక కేసులు పెట్టి వేధించారు. అయినా భయపడకుండా ఆయన పార్టీకి సేవలు అందించారు. కడిగిన ఆణిముత్యం లా బయటకి వచ్చారు. నెల్లూరు జిల్లా ప్రజలు ఆలోచించాలి. 2014 లో మూడు సీట్లు ఇస్తే టిడిపి చేసిన అభివృద్ధి, 2019 లో 10 కి 10 సీట్లు ఇస్తే వైసిపి చేసిన అభివృద్ధి ని బేరీజు వేసుకోండి. నెల్లూరు జిల్లా మళ్లీ అభివృద్ధి చెందాలి అంటే 2019 లో వైసిపి కి ఇచ్చిన 10 సీట్లు మాకు ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.
గత నాలుగేళ్లుగా టిడిపి నాయకులు అజీజ్ గారు, కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడ్డారు. కార్యకర్తలకు అండగా నిలబడ్డారు.వారి భవిష్యత్తు నా బాధ్యత. సైకో బ్యాచ్ కి మరోసారి చెబుతున్నా సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. తగ్గేదేలేదు. ఫ్లెక్సీలు పెట్టి పారిపోవడం కాదు నేరుగా రండి తేల్చుకుందాం. గంజాయి బ్రో భయం మా బయోడేటా లో లేదు. బాంబులకే భయపడని కుటుంబం మాది. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవ్వరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తాం. సైకో పోవాలి…సైకిల్ రావాలి.