టిడిపి అధికారంలోకి వచ్చాక కర్నూలు 50వ డివిజన్ లో తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం కర్నూలు కర్నూలు 50వ డివిజన్ టిడ్కో బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మా డివిజన్ లో 1200మంది గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకోసం రూ.లక్ష చొప్పున చెల్లించాం. ఇంతవరకు ఇళ్లను పూర్తిచేసి ఇవ్వలేదు.
వార్డుల్లో మంచినీరు సరిగా రావడంలేదు, నీటి సమస్య ఇబ్బందిగా ఉంది.
బిసి కార్పొరేషన్ లో లోన్లు తీసుకున్న 18మంది రజకులు లోన్లు క్లియర్ చేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదు.
50వవార్డులో పార్కు, లైబ్రరీ ఏర్పాటుచేయాలి.
మా వార్డులో విద్యుత్ స్తంభాలు, విద్యుత్, డ్రైనేజి సమస్యలు ఉన్నాయి.
మా సమస్యల పరిష్కారానికి చొరవచూపండి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో 90శాతానికి పైగా పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను మిగిలిన పనులు పూర్తిచేసి ఇవ్వకుండా సైకో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది.
పట్టణాలు, నగరాల్లో పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ద, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై లేదు.
50వ డివిజన్ లో ఖాళీస్థలాన్ని గుర్తించి పార్కు, లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.