జనం నువ్వే మా దరిద్రం అంటున్నారు జగన్
జగన్ పర్మినెంట్ గా లండన్ పారిపోవడం ఖాయం
తాడేపల్లిలో పెద్దపిల్లి.. తాడిపత్రిలో చిన్నపిల్లి!
రాయలచెరువు బహిరంగసభలో యువనేత లోకేష్
…….
ముఖ్యమంత్రి జగన్ మొన్నటి వరకూ సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు. ఇప్పుడు సంచి పట్టుకొని స్టిక్కర్లు అతికించుకుంటున్నాడు. వైసిపి నేతలు నువ్వే మా భవిష్యత్తు అంటూ స్టిక్కర్ అతికిస్తుంటే జనం మాత్రం మా దరిద్రం నువ్వే జగన్ అని అంటున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గం రాయలచెరువులో జరిగిన బహిరంగసభలో యువనేత మాట్లాడుతూ నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్ అతికిస్తే సొంత తల్లి, చెల్లి నమ్మని వాడిని మేము ఎలా నమ్మాలి అని జనం నిలదీస్తున్నారుఅని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ మోహన్ ఒక స్టిక్కర్ సీఎం, అందుకే ఆయనకి స్టిక్కర్ మోహన్ అని పేరు పెట్టాను. ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన తండ్రి అని చెప్పుకోవడం స్టిక్కర్ మోహన్ స్పెషాలిటీ. టిడిపి హయాంలో కట్టిన టిడ్కొ ఇళ్లకు వైసిపి రంగులు పూస్తాడు. పాదయాత్ర 68 రోజులకే వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక 400 రోజులు పూర్తయ్యే సరికి జగన్ పర్మినెంట్ గా లండన్ కి పారిపోవడం ఖాయం. జగన్ ది మూర్ఖత్వం. లోకేష్ ది మానవత్వం. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం. మీ లోకేష్ ది అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంబేద్కర్ రాజ్యాంగం దెబ్బకి తాడేపల్లి ప్యాలస్ లో భూకంపం వచ్చిందిఅని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పర్యటించిన నేల తాడిపత్రి. చింతల రమణ స్వామి దేవాలయం, బుగ్గ రామలింగేశ్వర స్వామి కొలువైన ప్రాంతం తాడిపత్రి. మహాత్మా గాంధీ పర్యటించిన పవిత్ర నేల తాడిపత్రి. దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన తాడిపత్రి మున్సిపాలిటీ కలిగిన నియోజకవర్గం. నందమూరి తారకరామారావుని బర్తరఫ్ చేసినప్పుడు పిడికిలి బిగించింది తాడిపత్రి. ఇంత గొప్ప నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం అని లోకేష్ పేర్కొన్నారు.
విషయం వీక్… పబ్లిసిటీ పీక్
స్టిక్కర్ మోహన్ కి విషయం వీక్ . పబ్లిసిటీ మాత్రం పీక్స్. యువగళంలో వచ్చిన జనంతో తాడిపత్రి పోటెత్తిందని లోకేష్ చెప్పారు. ఒక్క ఉదాహరణ చెబుతాను. రూ.వెయ్యి దాటిన ఏ జబ్బుకైనా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని ఫుల్ పబ్లిసిటీ ఇచ్చాడు. ఎక్కడైనా అమలు అవుతుందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం దూది, మందులు కూడా లేవు. ఇక ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చెయ్యడం లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే డాక్టర్లను ఒత్తిడి చేసి దొంగ రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. గ్రామాలను ఉద్ధరిస్తా అని బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు పంచాయతీ నిధులు మొత్తం కాజేసాడు. ప్రకాశం జిల్లా చినాంపల్లె వైసిపి సర్పంచ్ చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపాడు అని విమర్శించారు.
స్కిక్కర్ సిఎం వద్ద రెండుబటన్లు
స్టిక్కర్ మోహన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. స్టిక్కర్ మోహన్ వాలంటీర్ వాసు ని అసత్య ప్రచారం ప్రచారం మొదలు పెట్టారు. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి టిడిపి గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే టిడిపి.సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ స్టిక్కర్ మోహన్ ది. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ స్టిక్కర్ మోహన్. స్టిక్కర్ మోహన్ యువతని చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు అని విమర్శించారు.
ప్రతిఏటా జాబ్ క్యాలెండర్
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం అని లోకేష్ వెల్లడించారు. స్టిక్కర్ మోహన్ మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం అని హామీ ఇచ్చారు.
రైతులను కోలుకోలేని దెబ్బతీశాడు
స్టిక్కర్ మోహన్ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. స్టిక్కర్ మోహన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. నేరేడు,చీనీ, సపోట, దానిమ్మ, మామిడి, అరటి, వేరుశనగ, టమాటో రైతుల్ని మేము ఆదుకుంటాం అని లోకేష్ తెలిపారు. స్టిక్కర్ మోహన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు స్టిక్కర్ మోహన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు అని హెచ్చరించారు.
బిసిలు, మైనారిటీల బ్యాక్ బోన్ విరిచాడు
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు స్టిక్కర్ మోహన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు అని వివరించారు.
మైనారిటీలకు దారుణమోసం
మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు అని తెలిపారు.
తాడిపత్రిని అభివృద్ధి చేసింది జెసి కుటుంబం
తాడిపత్రిని అభివృద్ధి చేసింది జేసి కుటుంబం. గతంలో పర్యటనకు వచ్చినప్పుడు మీ మున్సిపాలిటీ భవనం చూసి ఆశ్చర్యపోయాను. అభివృద్ధి లో జేసి ప్రభాకర్ రెడ్డి గారి రికార్డులు బ్రేక్ చెయ్యడం ఎవరి తరం కాదు. సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పార్కులు, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి, ఎల్ఈడి విధి దీపాలు, స్కూల్స్, కాలేజీలు, రోడ్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జేసి ప్రభాకర్ రెడ్డి గారు. అభివృద్ధి లో తాడిపత్రి మున్సిపాలిటీ దరిదాపుల్లో కూడా మరో మున్సిపాలిటీ లేదు. సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రానైట్ పరిశ్రమలు తెచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది జేసి ప్రభాకర్ రెడ్డి అని లోకేష్ ప్రశంసించారు. వేసవిలోనూ తాడిపత్రికి తాగునీటి కష్టాలు లేవంటే దాని వెనుక జేసి ప్రభాకర్ రెడ్డి కష్టం కనిపిస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ పంపు సెట్లు ఇచ్చి రైతుల్ని ఆదుకుంది టిడిపి ప్రభుత్వం. కానీ మీరు ఎం చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకోని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. జేసి పాలనలో తాడిపత్రి ఎలా ఉంది? దున్నపోతు పాలనలో తాడిపత్రి ఎలా ఉంది? అని ప్రశ్నించారు.
తాడేపల్లిలో పెద్దపిల్లి.. తాడిపత్రిలో చిన్నపిల్లి
తాడేపల్లి ప్యాలస్ లో పెద్ద పిల్లి ఉంది. తాడిపత్రిలో చిన్న పిల్లి ఉంది. పేరుకే పెద్దారెడ్డి చేసేవి అన్ని చిల్లర పనులే. తాడేపల్లి ప్యాలస్ పిల్లి పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. తాడిపత్రి పిల్లి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక వెళ్లి బిల్డప్ ఇస్తుంది. పిల్లి సరదాగా సింహాసనం మీద కూర్చున్నంత మాత్రానా సింహం అవుతుందా? తాడిపత్రి పిల్లి ని చూస్తే జాలి వేస్తుంది. నా పాదయాత్ర పూర్తయిన తరువాత ధర్మవరంలో అబ్బాయ్ కేటు పోసుకున్నాడు. బాబాయ్ నా పాదయాత్ర నియోజకవర్గంలో ప్రారంభం కాకముందే పోసేసుకున్నాడు అని ఎద్దేవ చేశారు.
అవినీతి అనకొండ పెద్దారెడ్డి
తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసే అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నియోజకవర్గంలోని కొండలు, గుట్టలు, నదులు, గనులు అన్నిటిని మింగేస్తున్న అతి పెద్ద అవినీతి అనకొండ ఈయన. ఎమ్మెల్యే కాకముందు చిన్న వాహనం ఉండేది. ఇప్పుడు పదుల కొద్దీ లగ్జరీ కార్లు ఎలా వచ్చాయి. ఈయన అవినీతిలో అంచెలంచలుగా ఎదిగాడు. మొదట్లో పెన్నా నది నుంచి ఇసుక తోలే ఎద్దుల బండి యజమానుల నుంచి రూ.10 వేలు వసూలు చేసేవాడు. తర్వాత కొద్దికొద్దిగా నదిని ఆక్రమించేశాడు. ఎవరైనా ఇంటికి గేటు పెట్టుకుంటారు.. పొలాలకు కంచెలు వేసుకుంటారు. కానీ ఈ పెద్దారెడ్డి స్టైల్ వేరు. ఏకంగా పెన్నా నదికే గేట్లు పెట్టేసాడు. తన అనుచరులకు నదిని వాటాలు వేసి పంచేసాడు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నాడు. ఇదంతా తాడిపత్రి టౌన్ కు ఆనుకునే జరుగుతోంది. ఇసుకలో కమీషన్ రూపంలో రోజుకు మూడు లక్షలు ఆయన జేబులోకి వెళ్ళిపోతోంది. ఇలా రెండు సంవత్సరాలుగా పెన్నా నదిని కొల్లగొడుతున్నాడు. పెద్దపప్పూరు మండల కేంద్రం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని వేల టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలించారు. మైన్స్ అధికారులు వచ్చి అడ్డుకున్నా ఇసుక తవ్వకాలు ఆపలేదు. పర్మిషన్ చూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని జేసి ప్రభాకర్ రెడ్డి సవాల్ చేసారు. ఆ తరువాత అనుమతులు ఇచ్చారు. అనుమతి ఇచ్చింది గోరంత. తవ్వుతుంది కొండంత. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇసుక దందా చూసిన తర్వాత..ఆయన అన్నం తిని బతుకుతున్నాడా ఇసుక తిని బతుకుతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి అని ఆరోపించారు.
కొండలు, గుట్టలనూ వదలడం లేదు
ఇసుకతోపాటు ఈ పెద్దారెడ్డి కొండలు గుట్టలను కూడా వదలడం లేదు. ఎర్రగా ఉన్న గుట్ట కనిపిస్తే చాలు తవ్వేస్తున్నారు. మట్టిని ట్రాక్టర్ రూ.2000 చొప్పున తాడిపత్రిలోనే విక్రయిస్తున్నారు. మట్టి తవ్వకాలతో గుట్టలను చదును చేసిన తర్వాత పనిలో పనిగా ఆ భూమిని ఆక్రమించేసి కంచి వేసుకుంటున్నాడు. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఎర్రగుట్టపల్లి వద్ద ఉన్న గుట్టను మీ పెద్దారెడ్డి బంధువు పూర్తిగా తవ్వేసి మట్టిని విక్రయించుకున్నాడు. తర్వాత ఆ గుట్టను ఆక్రమించి చదును చేశాడు. పెదపపూర్ మండలం ముచ్చుకోట గ్రామంలో ఓ విశ్రాంత అధికారి తనకున్న భూమిలో కొంత ఆలయానికి ఇచ్చాడు. మిగిలిన భూమిలో ఇల్లు కట్టుకొని జీవనం సాగించాలని ఆశించారు. అయితే ఈ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు ఆ భూమిని కబ్జా చేశారు. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే. దీంతో ఆ వృద్ధ దంపతులు వారి స్థలంలో నిరసనకు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది. చాగల్లు రిజర్వాయర్లో ముంపునకు గురైన గ్రామస్తులకు డ్యాం పక్కనే పునరావాసం కల్పించారు. ఆ గ్రామంలో గుడి, బడి వంటి భవిష్యత్తు అవసరాల కోసం రెండు ఎకరాలు కేటాయించారు. ఎమ్మెల్యే అనుసరుడు ఆ భూమిని కబ్జా చేసి పంటలు వేశాడు. రాయల చెరువులోని బలపం ఫ్యాక్టరీల యజమానులను బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్నాడు. కప్పం కట్టని వారిపై అధికారులను ఉసిగొల్పి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇటీవల ఒక నెల రోజులపాటు రాయలచెరువులోని బలపం ఫ్యాక్టరీలన్నింటిని మూయించి నానా ఇబ్బందులు పెట్టాడు. దీంతో ఆ ఫ్యాక్టరీ యజమానులు అంతా కలిసి ఎమ్మెల్యేలకు కమిషన్ ఇచ్చుకోవాల్సి వచ్చిందని వివరించారు.
సొంతపార్టీ కార్యకర్తలు కూడా బలి
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధన దాహానికి సొంత కార్యకర్తలను కూడా బలి తీసుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరుల అక్రమాల గురించి తెలుసుకున్న ఎల్లనూరు మండలానికి చెందిన వైసిపి సర్పంచ్ పై దొంగతనం కేసు బనాయించి పోలీసులతో అతి కిరాతకంగా కొట్టించారు. దెబ్బలకు తాళలేక ఆ వైకాపా సర్పంచ్ చనిపోవడంతో ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి తీసుకెళ్లి శవాన్ని పడేశారు. అవమానభారంతో ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి కేసును పక్కదారి పట్టించారు. ఆ సర్పంచ్ తల్లి తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని కొట్టి చంపారని చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఎస్పీ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆరోపించారు.
జగన్ హామీలు ఏమయ్యాయి?
పాదయాత్రలో భాగంగా తాడిపత్రి వచ్చిన జగన్ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తిచేస్తాం అని హామీ ఇచ్చాడు.పెండేకల్లు ప్రాజెక్టు నిర్మించి ఏళ్లు అవుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.122 కోట్లతో కాలువలు పూర్తి చేసి 18వేల ఎకరాలకు నీరు అందిస్తాం అన్నారు. కనీసం ఒక గంప మట్టి కూడా తియ్యలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. తాడిపత్రిలోని గ్రానైట్ పరిశ్రమలను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. మూతబడిన పరిశ్రమలు తెరిపించి 20,000 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. కరెంటు చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. గ్రానైట్ బై రాయల్టీని తగ్గించి యజమానులను ఆదుకుంటామని చెప్పిన జగన్.. అవేవీ చేయకపోగా రివర్స్లో కరెంటు చార్జీలు పెంచారు. రాయల్టీ రెండింతలు పెంచారు. కరెంటు కోతలు విధించారు. కరెంటు కోతలతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. వందల మంది ఉపాధి కోల్పోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో రవాణా చార్జీలు భరించలేక వ్యాపారులు నష్టాలు మూటగట్టుకుని పరిశ్రమలను మోసేస్తున్నారు. జగన్ పాలనలో గ్రానైట్ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. పెంచిన రాయల్టీ, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్,డీజిల్ ధరలు అన్ని తగ్గిస్తాం. వేధింపులు లేకుండా వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
చేనేతలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
పాదయాత్రలో భాగంగా తాడిపత్రి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 24 వేలు అందిస్తానని హామీ ఇచ్చాడు. అయితే అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నేతన్న నేస్తం అంటూ పథకాన్ని ప్రారంభించాడు. కార్మికులకు కాకుండా సొంత మగ్గం ఉన్నవాళ్లకి మాత్రమే పథకం అంటూ ఫిట్టింగ్ పెట్టారు. టిడిపి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించాం. టిడిపి ప్రభుత్వంలో చేనేత ఉత్పత్తులపై ఒక్క శాతం కూడా పన్ను విధించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చేనేత ఉత్పత్తిపై 5 శాతం జీఎస్టీ విధించి చేనేతలను కోల్కోలేని దెబ్బ కొట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పై జీఎస్టీ ఎత్తివేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేతలకు చేనేత రుణమాఫీ కింద 110 కోట్ల రూపాయలు చెల్లించాంఅని వివరించారు.
వైసిపి హయాంలో చేనేతల ఆత్మహత్యలు
వైసిపి ప్రభుత్వ హయాంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి పరిహారం అందలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎలా అయితే ఇచ్చామో అలానే యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ అందిస్తాం. టిడ్కొ ఇళ్ళు కేటాయిస్తాం. కామన్ వర్కింగ్ షెడ్లు నిర్మిస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తాం. తాడిపత్రి చేనేతకు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాం. చేనేత క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తాం. టిడిపి ప్రభుత్వంలో టిడ్కొ ఇల్లు 6300 మంజూరు కాగా 1800 ఇల్లు పూర్తీ చేయడం జరిగింది. వైసిపి ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క ఇల్లు
కూడా ఇవ్వలేదు. కార్యకర్తల్ని వేధించిన ఎవరిని వదిలి పెట్టను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అతి చేసిన అధికారుల పై చర్యలు తీసుకుంటామని లోకేష్ వెల్లడించారు.