టిడిపి అధికారంలోకి రాగానే పంచాయతీలను బలోపేతం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గంలోని రాయలచెరువు గ్రామస్థులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాలు కళావిహీనంగా మారాయన్నారు. గ్రామపంచాయతీ లలో అభివృద్ధి పనులకు ఉద్దేశించిన ఫైనాన్స్ కమీషన్ నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామాలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయటంతో పాటు రాయలచెరువు గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.