యువగళం పాదయాత్రలో భాగంగా డోన్ నియోజకవర్గంలో శుక్రవారం గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 1.76కోట్ల గొర్రెలు, 55.22లక్షల మేకలు ఉన్నాయి. గొర్రెలు,మేకల పెంపకానికి అవసరమైన పచ్చిక బయలు భూములు తగ్గిపోయాయి. ఎన్.సీ.డీ.సీ పథకంలో సబ్సిడీ 20శాతమే ఉంది. దాన్ని 75శాతానికి పెంచాలి.
జీవాలకు షెడ్లు నిర్మించి ప్రకృతి విపత్తుల నుండి కాపాడాలి. గొర్రెలు,మేకల పెంపకందారులకు 50ఏళ్లకే పెన్షన్లు అందించాలి. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో సబ్సిడీపై గొర్రెలు, మేకల యూనిట్లను అందించాం. ఉచిత ఇన్సూరెన్స్ అందించి జీవాల పెంపకందారుల నష్టాలను తగ్గించాం. అధికారంలోకి వచ్చాక సబ్సిడీలు పెంచుతాం. జీవాలకు షెడ్లు నిర్మిస్తాం. 50ఏళ్లకు పెన్షన్లపై మ్యానిఫెస్టోలో స్పష్టతనిస్తాం అని హామీ ఇచ్చారు.