నెల్లూరు జిల్లా ని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. పేరులోనే నిల్లు ఉన్న అ ‘నిల్లు’ చేసింది ఏంటి? డైలాగులు కొట్టడం తప్ప సిటీ కి సిల్లీ బచ్చా పీకింది ఏంటి? నెల్లూరు సిటీ కి వచ్చా, విఆర్సి సెంటర్ కి వచ్చా నెల్లూరు అభివృద్ది పై చర్చ కు సిద్దమా? అభివృద్ది పై చర్చకి సిద్దమా అంటే పారిపోయాడు. సిల్లీ బచ్చాకి సబ్జెక్ట్ లో హాఫ్ నాలెడ్జ్.. అవినీతి లో ఫుల్ నాలెడ్జ్. సిల్లీ బచ్చా సిటీకి తెచ్చిన నిధులు నిల్లు… కానీ నాలుగేళ్లలో పోగేసింది ఏంతో తెలుసా? వెయ్యి కోట్లు. సిల్లీ బచ్చా భూకబ్జాల లిస్ట్, భూ దందాల మొత్తం ఈ రోజు నేను బయటపెడుతున్నా. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు.
నాయుడుపేట లో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు. ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు. ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు. అల్లీపురం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి. సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు. ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవి కి కోట్ల రూపాయలు వచ్చాయి. బృందావనం లో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు. దామరమడుగు లో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేసి అమ్మేస్తున్నాడు.
ఆఖరికి కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నాడు సిల్లీ బచ్చా. వ్యాపారస్తులను, ఆసుపత్రుల యజమానులు, జ్యువెలరీ షాపుల వారిని బెదిరించి కోట్లు కొట్టేసాడు. సిల్లీ బచ్చా అండ్ కంపెనీ పెన్నా నది నుండి ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు దోచుకుంది. ఇలానే వదిలేస్తే సిల్లీ బచ్చా తనని మించిపోతాడని జగన్ కి భయం పట్టుకుంది. అందుకే సీటు చింపేసాడు. క్లారిటీ ఉంది కాబట్టే సిల్లీ బచ్చా చెన్నై లో 50 కోట్లతో ఇళ్లు కట్టాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే రాష్ట్రం నుండి పరార్. ఎక్కడ ఉన్నా సిల్లీ బచ్చా చేసిన భూ అక్రమాల పై ప్రత్యేక సిట్ వేస్తాం అని నెల్లూరు సిటీ విఆర్సి జంక్షన్ బహిరంగ సభలో నారా లోకేష్ అన్నాడు.