• సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులైన మత్య్సకారులకు మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి.
• ముత్తుకూరులో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలి.
• యువకులకు మినీ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలి.
• కృష్ణపట్నం పోర్టు నిర్వాసిత గ్రామాలకు టీడీపీ ప్రభుత్వంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించారు, రహదారి సౌకర్యం కల్పించాలి.
• టీడీపీ ప్రభుత్వంలో చేపల మార్కెట్, మినీ క్రికెట్ స్టేడియం, ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపన చేసి, నిధులు కూడా కేటాయించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనుల్లో పురోగతి లేదు.
• టీడీపీ వచ్చిన వెంటనే పనులను పూర్తి చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• నిర్వాసిత మత్స్యకారుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం.
• మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ ఫిషింగ్ హార్బర్, చేపలమార్కెట్, యువకులకు మినీ స్టేడియం నిర్మిస్తాం.
• శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పిస్తాం.