సంతనూతలపాడు యూత్ పవర్ సూపర్. చీమకుర్తి గెలక్సీ గ్రానైట్ ప్రపంచం మొత్తం ఫేమస్. మల్లవరం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, రామతీర్థం శ్రీ మోక్షరామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి సంతనూతలపాడు. ప్రజల దాహం తీర్చే రామతీర్థం, గుండ్లకమ్మ రిజర్వాయర్లు ఉన్న గొప్ప నేల సంతనూతలపాడు. దేశం కోసం పోరాడిన ప్రకాశం పంతులు గారు జన్మించిన నేల సంతనూతలపాడు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. మీకో చిన్న క్విజ్ పెడతాను. కరెక్ట్ సమాధానం చెప్పాలి. సడన్ గా ఫ్రస్ట్రేటెడ్ బాయ్ జగన్ కి లోకేష్ ఎందుకు గుర్తొచ్చాడు? మొదటి ఆప్షన్. అబ్బాయిలే బాబాయ్ ని లేపేసారని షర్మిల గారు ఇచ్చిన వాంగ్మూలం బయటకి రాకుండా ఉండటానికి? రెండో ఆప్షన్. అవినాష్ ని కాపాడటానికి భారతి రెడ్డి గారు లాబీయింగ్ చేసారంటూ సునీత గారు ఇచ్చిన వాంగ్మూలం బయటకు రాకుండా ఉండటానికి? మూడో ఆప్షన్. బాబాయ్ మర్డర్ కేసులో ప్యాలస్ బ్రోకర్ సజ్జల ఇన్వాల్వ్ అయిన విషయం బయటకి రాకుండా ఉండటం కోసం? నాలుగో ఆప్షన్. ఆల్ ది అబోవ్. ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపింది ఎవరు? జగన్. పిన్ని తాళి తెంచింది ఎవరు? జగన్. టివి, పేపర్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా చెల్లెళ్ళ వాంగ్మూలం వార్తలే.
పైనుండి ఇవన్నీ చూసిన వైఎస్ గారి ఆత్మ, వివేకా గారి ఆత్మ మాట్లాడుకున్నాయి. వైఎస్ తో వివేకా గారు నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నయ్యా అన్నారు. ఎం అయ్యింది వివేకా ఆలా అంటున్నావ్ అన్నారు వైఎస్. నువ్వు ముందే వచ్చేసావ్ లేదంటే నాకు పట్టిన గతే నీకు పట్టేది అన్నారు. ఆమ్మో అంత టార్చర్ నేను తట్టుకోలేను తమ్ముడూ అంటూ వెళ్లిపోయారు వైఎస్. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని వాడు ప్రజలకి న్యాయం చేస్తాడా? మానవత్వం ఉన్న సీఎం కి, సైకో సీఎం కి మధ్య ఉన్న తేడా మీకు తెలియాలి. రావత్ అనే గిరిజనుడు పై దాడి చేసి ఒక వ్యక్తి అతని పై మూత్రం పోసాడు. నిందితుడి తాట తీసారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్. బాధితుడిని ఇంటికి పిలిచి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పి ఆదుకున్నారు. అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. ఒంగోలులో గిరిజన యువకుడు నవీన్ పై దాడి చేసి మూత్రం పోసాడు రామాంజనేయులు అనే దుర్మార్గుడు. నిందితుడి పై యాక్షన్ లేదు..బాధితుడిని పట్టించుకున్నవాడు లేడు. జగన్ ది మాయాబజార్. ఎన్ని కోట్లు ఖర్చయినా ఎస్సి, ఎస్టీ,బిసి, మైనార్టీ విద్యార్థులను ఉచితంగా డాక్టర్లను చేస్తానని మాయ మాటలు చెప్పాడు.. ఇప్పుడు మెడికల్ సీట్లు బజార్ లో అమ్మేస్తున్నాడు. ఎస్సి,ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు దక్కాల్సిన మెడికల్ సీట్లను జగన్ అమ్ముకుంటున్నాడు.
ఇప్పటివరకూ కన్వీనర్ కోటాలో ఏడాదికి రూ.15 వేల ఫీజు. మాయాబజార్ జగన్ ఫీజు ఎంత పెంచాడో తెలుసా? ఏడాదికి 20 లక్షల ఫీజు ఎస్సి,ఎస్టీ, బిసి, మైనార్టీ కట్టగలరా జగన్? ఒక్క సీటు కోటి రూపాయలు. అదీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో. ఆఖరికి మెడికల్ కాలేజీల్లో కూడా జగన్ బాదుడే బాదుడు. దీనిపై ఎం సమాధానం చెబుతారని అడిగితే వైద్య శాఖ మంత్రి రజిని గారు ఎం సమాధానం చెప్పారో తెలుసా? విద్యార్థులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా ఆపడానికి సీట్లు అమ్మకానికి పెట్టారట? కిర్గిస్థాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి 5+1 సంవత్సరాలు రానుపోను చార్జీలు, హాస్టల్‌తో కలిసి కూడా గరిష్టంగా 35 లక్షలు అవుతుంది. అందుకే అనేది జగన్ మతం క్యాష్..జగన్ కులం క్యాష్. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది.. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.
తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం.
2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. సంతనూతలపాడుని అభివృద్ధి లో నంబర్ 1 చేస్తారని మీరు సుధాకర్ బాబు గారిని గెలిపించారు. కానీ ఆయన సంతనూతలపాడుని అవినీతి లో నంబర్ 1 చేసారు.
ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతి గురించి తెలుసుకున్న తరువాత నేను ఒక పేరు పెడతాను కానీ సుధాకర్ బాబు గారు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 2019 లో కష్టపడి గెలిపించిన వైసిపి నాయకులు, కార్యకర్తలే ఆయనకి ముద్దుగా కలక్షన్ బాబు అని పేరు పెట్టారట. చిల్లర కొట్టు దగ్గర నుండి చీమకుర్తి గ్రానైట్ వరకూ కలక్షన్ బాబు బాదుడే బాదుడు. సెంటు స్థలాల పేరుతో తక్కువ రేటుకి రైతుల దగ్గర భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మేసారు కలక్షన్ బాబు, ఆయన అనుచరులు. సెంటు స్థలాల్లో కలక్షన్ బాబు వాటా రూ.50 కోట్లు. అక్కడితో ఆగిపోలేదు వలంటీర్లను పంపి సెంటు స్థలాల లబ్ధిదారుల దగ్గర ఒక్కొక్కరి నుండి రూ.10 వేలు కొట్టేసారు. గుండ్లకమ్మ నదిలో ఇసుకను దోచేసి కోట్లు సంపాదిస్తున్నారు. వాచ్ మాన్ పోస్టుల నుండి షిఫ్ట్ ఆపరేటర్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ పోస్టుల వరకూ అన్ని సేల్ కి పెట్టారు కలక్షన్ బాబు. ప్రభుత్వ ఉద్యోగస్తుల పోస్టింగ్ కోసం కూడా కలక్షన్ బాబు కి కప్పం కట్టాల్సిందే. గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల్ని టార్చర్ చేస్తున్నారు కలక్షన్ బాబు. లారీ కి రూ.5000 వేలు కమిషన్ కట్టకపోతే లారీ కదలదు. కప్పం కట్టకపోతే కలక్షన్ బాబు కి కోపం వస్తుంది వెంటనే అధికారులను పంపి మైన్ సీజ్ చెయ్యడం, ఫైన్లు వేయించడం పనిగా పెట్టుకున్నారు. మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో కలక్షన్ బాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు. గ్రావెల్ దందా లో కోట్లు కొట్టేస్తున్నారు. ఉపాధిహామీ పధకంలో భాగంగా చెయ్యని పనులు చేసినట్టు చూపి దొంగ బిల్లులు డ్రా చేసారు కలక్షన్ బాబు.
కలక్షన్ బాబు అందరికి సమన్యాయం చేస్తారట. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కప్పం కడితేనే పని అవుతుంది. సంతనూతలపాడు నియోజకవర్గానికి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ ని ఆదుకుంటాను అని హామీ ఇచ్చాడు. నాశనం చేసాడు. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. తగ్గించాడా? సీఎం గా చీమకుర్తి కి వచ్చినప్పుడు యూనిట్ కి రూ.2 తగ్గిస్తూ సంతకం చేసి వచ్చా అన్నాడు. అమలు అయ్యిందా? తగ్గించకపోగా సర్ ఛార్జ్ పేరుతో మరో రూపాయి పెంచాడు. రాయల్టీ 50 శాతం పెంచేసాడు. ఒంగోలు డైరీ తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడు. అమూల్ కి కట్టబెట్టాడు. అదీ ఆగిపోయింది. చీమకుర్తి లో ఈఎస్ఐ ఆసుపత్రి కట్టిస్తానని హామీ ఇచ్చాడు. కట్టాడా? సుబాబుల రైతులకు టన్నుకు రూ.5 వేలు ఇస్తానని చెప్పాడు, ఏఎంసి ల ద్వారా కొనుగోలు చేస్తానని అన్నాడు. టిడిపి హయాంలో టన్ను రూ.4 వేల నుండి రూ.4,500 ఉంటే ఇప్పుడు ఎంత రూ.3 వేల లోపే. సంతనూతలపాడు ను అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, సిసి రోడ్లు వేసి అభివృద్ధి చేసింది టిడిపి. రూ.200 కోట్లతో రోడ్లు వేసాం. రూ.150 కోట్లతో సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించాం. సంతనూతలపాడులో పసుపు జెండా ఎగరేయండి.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెంచేసిన రాయల్టీ, కరెంట్ ఛార్జీలు తగ్గించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటాం. మైనింగ్ యజమానులు మేము ఆదుకుంటాం మీనుండి నేను కోరేది ఒక్కటే లక్షలాదిగా యువత కు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించండి.
సుబాబుల్, జామాయిల్ రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఒంగోలు డైరీని తిరిగి ప్రారంభిస్తాం. గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద కీర్తిపాడు, చీరవనుప్పాలపాడు చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిచేస్తాం. రామతీర్ధం, గుండ్లకమ్మ రిజర్వాయర్లు,కారుమంచి మేజర్ కాలువ రిపేర్ వర్క్స్ పూర్తి చేస్తాం. చీమకుర్తి మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పధకం ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. టిడిపి జెండా మోసిన ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. సంతనూతలపాడులో ఉన్నా సింగపూర్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. కార్యకర్తల్ని వేధించిన అధికారుల పేర్లను ఎర్ర పుస్తకం లో రాసుకుంటున్నా. జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకుంటాం. టిడిపి వస్తే వర్షాలు రావని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడ అడుగుపెడితే అక్కడ వర్షం పడుతుంది.