గూడూరు యూత్ దెబ్బకి జంక్షన్ జామైపోయింది. రాజులు ఏలిన నేల గూడూరు. అళగనాథ స్వామి దేవాలయం, మల్లం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి గూడూరు. ఇక్కడ పండే నిమ్మ, ఇక్కడ పెరిగే రొయ్య రాష్ట్రమంతా ఫ్యామస్. సహజ వనరులు ఉన్న గొప్ప నేల గూడూరు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు జన్మించిన నేల గూడూరు. ఘన చరిత్ర ఉన్న గూడూరు నేల పై నడవడం నా అదృష్టం. యువగళం… మనగళం… ప్రజాబలం. యువగళాన్ని మొదటి రోజే ఆపేస్తాం అన్నారు… 140 రోజులు నడిచా. యువగళానికి అడుగడుగునా అడ్డుపడ్డారు… 1800 కిలోమీటర్లు పూర్తిచేసా. యువగళాన్ని నొక్కేస్తాం అన్నారు… ఇప్పుడు రాష్ట్రమంతా యువగళమే. యువగళం దెబ్బకి సైకో జగన్ కి జ్వరం వచ్చింది. ప్యాలస్ లో టివిలు పగలగొడుతున్నాడు. యువగళం కి వస్తున్న ప్రజాధారణ చూసి జగన్ భపడుతున్నాడు, జగన్ టెన్షన్ పడుతున్నాడు, జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. యువగళాన్ని అడ్డుకోమని జగన్ సైకో సైన్యాన్ని పంపాడు. వాళ్లు కోడిగుడ్డు వేస్తే మన పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి పంపారు.
బాంబులకే భయపడని బ్లడ్ మాది నీ కోడిగుడ్డు కి భయపడతామా కోడికత్తి జగన్. నాకు అడ్డొస్తే భయపడే రకం కాదు. జగన్ కి భయాన్ని పరిచయం చేసే రకం. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర. అడ్డుకుంటే దండయాత్ర. మీ లోకేష్ ప్రజల్లో ఉంటాడు… జగన్ పరదాల్లో ఉంటాడు. జగన్ సభల్లో జనం ఉండరు… మీ లోకేష్ సభల్లో ఖాళీ ఉండదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రారంభించాడు జగన్. 25 మంది ఎంపీలను తనకి ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్నాడు. జగన్ నాటకాన్ని జనం నమ్మారు లోక్ సభ, రాజ్య సభ కలిపి 31 ఎంపీ సీట్లు ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆ వైసిపి ఎంపీలు ఎం చేస్తున్నారో తెలుసా? ఒక ఎంపీ బాబాయ్ ని లేపిసి అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక ఎంపీ జిప్పు విప్పి ఇండియా మొత్తం చూపించాడు. ఒక ఎంపీ యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తూ పూలు చల్లమని అడుక్కుంటున్నాడు. ఒక ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుక్కున్న కొడుకుని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒక ఎంపీ భార్యా, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయాడు. వీళ్లంతా కలిసి సాధించింది ఒక్కటే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కి చంచల్ గూడా జైల్లో ప్రత్యేక ఖైదీ హోదా సాధించారు. జగన్ చెత్త పాలన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వైసిపి ఎమ్మెల్యేలే నడి బజార్ లో జగన్ పరువు తీస్తున్నారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గారికి మంచి డౌట్ వచ్చింది? అసలు నేను ఎమ్మెల్యే నా? కాదా అని బాధపడ్డారు. లక్ష రూపాయల పని చేయించలేక ఆయన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బాధపడ్డాడు. ముస్తఫా గారు బయట ఏడ్చారు…మిగిలిన వైసిపి ఎమ్మెల్యేలు ఇంట్లో ఏడుస్తున్నారు. జగన్ ఏపీని పాత బీహార్ లా మార్చేసాడు. గంటకో మర్డర్..పూటకో రేప్. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి ని అడ్డుకున్నాడు. వైసిపి సైకో గ్యాంగ్ అమర్నాధ్ పై దాడి చేసి కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. చంద్రబాబు గారు అంటే భరోసా… జగన్ అంటే విధ్వంసం. చంద్రబాబు గారు సంపద సృష్టికర్త… జగన్ అప్పుల అప్పారావు. చంద్రబాబు గారు హీరో… జగన్ జీరో. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా.
జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు.కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటో కిలో రూ.100, పచ్చిమిర్చి రూ.100. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. తుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.
దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. సింహపురి లో నేను సింహం లా అడుగుపెట్టాను. యువగళం కి వస్తున్న రెస్పాన్స్ చూసి పిల్ల సైకోలు రోడ్ల మీదకి వచ్చి మొరుగుతున్నాయి. పిల్ల కాలువ తవ్వడం రాని సిల్లీ ఫెల్లోస్ అంతా ఛాలెంజ్ చేస్తున్నారు. 2014 లో మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి కి మూడు సీట్లే ఇచ్చారు. అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టిడ్కో ఇళ్లు నిర్మించాం.
ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసాం. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ఫెల్లోస్ వీళ్లు. ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకోని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి.
నెల్లూరు జిల్లా కి చంద్రబాబు గారు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలి. 2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు వైసిపి కి ఇచ్చారు. నెల్లూరు జిల్లా ని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి వచ్చాయి. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. ఆయనకి నోటి దూల ఫుల్లు…మ్యాటర్ నిల్లు. పోలవరానికి బుల్లెట్ దింపుతా అన్నాడు. పాపం ఆయనకి జగన్ బుల్లెట్ దింపేసాడు. పిల్ల కాలువ తవ్వడం రాని బచ్చా, 25 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసిన నన్ను ఛాలెంజ్ చెయ్యడం వింతగా ఉంది. ఈ సిల్లీ బచ్చా సీఎం ని కలవడానికి వెళితే ఛీ పొమ్మన్నాడట. సిల్లీ బచ్చా కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ప్లేస్ అండ్ టైం నువ్వు ఫిక్స్ చెయ్యి. ఎనీ టైం, ఎనీ ప్లేస్ చర్చకు నేను రెడీ. అయితే ఒక కండీషన్ జగన్ ని కూడా చర్చకు తీసుకొచ్చి నెల్లూరు సిటీ సీటు నీకే అని చెప్పించు. నేను మీ నాయకుడిలా కంచుకోట లో నిలబడి కాలర్ ఎగరవేయడం లేదు. కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచిన మంగళగిరి లో పోటీ చేసాను. ఓడిపోయాను. అయినా ప్రజలతో నిలబడ్డాను. సేవ చేస్తున్నాను. దమ్ముంటే మీ నాయకుడిని కంచుకోట నుండి బయటకి రమ్మను. కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. ఆయన 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం మీద ఆయనకి ఫుల్లు అవగాహన ఉంది. కల్తీ విత్తనాల మీద అవగాహన లేదు.
అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఈయన కల్తీ లిక్కర్ తయారీ లో బిజీగా ఉంటాడు. ఈయన వలన జిల్లాలో ఒక్క రైతుకి న్యాయం జరగలేదు. ఇక మరో కీలక శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆయన మన మధ్య లేరు. పాపం ఆయన కంపెనీలు తేవాలి అని ప్రయత్నం చేసినా జగన్ పరిపాలన చూసి ఎవరూ రాలేదు. నెల్లూరు జిల్లా కి ఒక్క పరిశ్రమ రాలేదు. మూడు కీలక శాఖలు నెల్లూరు జిల్లాకి వచ్చింది గుండు సున్నా. 2019 లో వైసిపి ఇచ్చిన పది సీట్లు మాకు ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం. గూడురు ని గొప్పగా అభివృద్ధి చేస్తారని 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వరప్రసాద్ రావు గారిని గెలిపించారు. గూడూరు కి గుండు కొట్టడం తప్ప చేసింది ఏమైనా ఉందా? ఒక్క దళితుడి జీవితం అయినా మారిందా? కష్టపడి వరప్రసాద్ గారిని గెలిపించుకున్న వైసిపి కార్యకర్తలు, నాయకులే వరప్రసాద్ గారి పేరుని కలక్షన్ ప్రసాద్ గా మార్చరట. ఆయన పలకరింపు సూపర్ గా ఉంటుంది అంట అందరినీ బాగున్నావా నాన్న, ఎలా ఉన్నావ్ నాన్న అని పలకరిస్తారు కానీ పని మాత్రం జరగదు. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు.
ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి జగన్ కి వందల కోట్లు లంచం ఇచ్చాను. డబ్బులు ఎం ఊరికే రావు అంటూ చికెన్ షాపులు, చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ నుండి కూడా లంచం వసూలు చేస్తున్నారు. గూడూరు,చిల్లకూరు లో అక్రమ గ్రావెల్ మాఫియా అంతా కలక్షన్ ప్రసాద్, ఆయన కుమారుడు నవీన్ నడుపుతున్నారు. ఇప్పటికే అక్రమ గ్రావెల్ మాఫియా ద్వారా రూ.100 కోట్లు కొట్టేసినట్టు వైసిపి నేతలే చెబుతున్నారు. కలక్షన్ ప్రసాద్ గారి ఎమ్మెల్యే లెటర్ వేల్యూ ఎంతో తెలుసా? 5 వేలు. అంగన్వాడీ పోస్టులు అమ్మకం, ట్రాన్సఫర్లకు వసూళ్లు, నామినేటేడ్ పోస్టులు వేలం, గుడి ట్రస్ట్ బోర్డు ఛైర్మెన్ పదవులకు రేట్ కార్డు. ఈయన స్టోరీలు విన్న తరువాత ఇలాంటి ఎమ్మెల్యే ఉంటారా అని నా దిమ్మ తిరిగిపోయింది.
గూడూరు మున్సిపాలిటీ లో కమిషనర్ ని పార్ట్నర్ గా చేసుకొని రోడ్లు వెయ్యకుండానే బిల్లులు డ్రా చెయ్యడం. షాపింగ్ కాంప్లెక్ లో అక్రమాలు, స్పెషల్ ఆఫీసర్లతో దొంగ సంతకాలు చేయించి 50 కోట్లు దోచేసాడు. మున్సిపాలిటీ లో అక్రమాలకు మీరారెడ్డి, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సతీష్ రెడ్డి ఇలా కలక్షన్ ఏజెంట్లు పెట్టుకున్నారు కలక్షన్ ప్రసాద్. కలక్షన్ ప్రసాద్ అవినీతి ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే స్టేట్ షాక్ అవుతుంది. ఇసుక,గ్రావెల్, సిలికా ట్రాన్స్ పోర్ట్ లో లెక్కలు పక్కాగా రాసేందుకు 100 మందిని పెట్టుకున్నారు. వీళ్ల పని ఏంటో తెలుసా? ఎన్ని లారీలు వెళ్లాయి, టైం, డేట్ అంతా రాసి రాత్రికి కలక్షన్ ఎంత వచ్చిందో చెప్పాలి. గూడూరు నియోజకవర్గంలో లో ఉన్న విలువైన సిలికా స్యాండ్ ని జగన్ అండ్ కంపెనీ కొట్టేసింది. ఈ దోపిడీ విలువ ఎంతో తెలుసా? 5 వేల కోట్లు. విజయసాయి రెడ్డి ఈ ఆపరేషన్ మొత్తం నడిపాడు. సిలికా, సిలికా స్యాండ్ వ్యాపారాలు ఒక్క ఛాన్స్ అనగానే పడిపోయారు. ఇప్పుడు చెప్పండి దున్నపోతు బాగా తన్నిందా? టిడిపి హయాంలో ఎప్పుడైనా మీ జోలికి వచ్చామా? ఎప్పుడైనా మైన్ యజమానులను ఇబ్బంది పెట్టామా? గూడూరులో వైసిపి నేతలు ప్రకృతిని ధ్వంసం చేసారు. సోనకాలువలు ఎండిపోతున్నాయి, పొలాల్లో పంటలు పండటం లేదు, సిలికా గుంతల్లో పడి మనుషులు చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి.
గూడూరు కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. నేను మాట్లాడే ఈ సెంటర్ కి దగ్గర్లోనే స్వర్ణముఖి బ్యారేజ్ ఉంది. అర టిఎంసి నీరు కూడా నిల్వ పెట్టలేం. కానీ జగన్ స్వర్ణముఖి బ్యారేజ్ లో 2 టిఎంసి నీళ్లు నిల్వ చేసి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో చెరువులకు నీరు ఇస్తానని హామీ ఇచ్చాడు. హామీ నెరవేర్చడా? చెరువులకు నీళ్లు వచ్చాయా? తెలుగు గంగ లింక్ కాలువలు పూర్తి చేసి చెరువులకు నీరు ఇస్తానని చెప్పారు. ఇచ్చారా? అటవీశాఖ అనుమతులు తెచ్చి వాకాడు, చిట్టమూరు మండలాల్లో గ్రామాలకు రోడ్లు, కరెంట్ ఇస్తానని చెప్పారు. ఇచ్చారా? మత్స్యకారులను కూడా మోసం చేసిన వ్యక్తి జగన్. దుగ్గరాజపట్నం, కోండూరు సముద్ర ముఖద్వారం వద్ద పూడిక తీస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారు.
గూడూరు పట్టణంలో ఫ్లై ఓవర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ గాల్లో కలిసిపోయింది. చిల్లకూరు,కోట,వాకాడు,చిట్టమూరు మండలాల్లో 7 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. విద్యుత్ ఛార్జీలు, పెట్టుబడి పెంచి జగన్ ఆక్వా రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా సబ్సిడీలు అందిస్తాం. జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. తూర్పు-పడమర గూడూరు ని కలుపుతూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి టిడిపి హయాంలో 63 కోట్లు మంజూరు చేసాం. ఈ ప్రభుత్వం ఆ పనులు పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన ఆ పనులు పూర్తిచేస్తాం.
నిమ్మ రైతుల కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉపాధి కల్పిస్తాం. టిడిపి హయాంలో పేదలకు 5,102 టిడ్కో ఇళ్ళు నిర్మిస్తే వాటిని ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తాం. టిడిపి కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తాం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా.