చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దర్శి నియోజకవర్గం ముండ్లమూరు బహిరంగ సభలో నారా లోకేష్…

by చైతన్యరధం
Aug 1, 2023 at 1:06pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
Nara Lokesh

Nara Lokesh Speech At Mundlamuru Public Meeting

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దర్శి దద్దరిల్లింది. శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి దర్శి. భౌద్దారామం ఉన్న నేల దర్శి. స్వాతంత్య్రం రాకముందే ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం దర్శి. సైకో పాలన పై మొదటి తిరుగుబాటు దర్శి నుండే ప్రారంభం అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ని గెలిపించారు దర్శి ప్రజలు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. జగన్ కొత్త పధకం ప్రారంభించాడు. ఆ పధకం పేరు ఏంటో తెలుసా ‘సైకో స్విమ్మింగ్ పూల్స్’. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నా అని బిల్డప్ ఇచ్చాడు జగన్. కానీ కట్టింది ఏంటో తెలుసా? స్విమ్మింగ్ పూల్స్. సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్ల స్కాం కి పాల్పడ్డాడు జగన్. ఉండటానికి పనికిరాని స్థలాలు పేదలకి ఇచ్చాడు. ఆ స్థలాల లెవెలింగ్ పేరుతో మరో రూ.2,200 కోట్లు కొట్టేసాడు. చిన్న వర్షం వస్తేనే ఆ స్థలాలు అన్ని స్విమ్మింగ్ పూల్స్ లా తయారు అవుతున్నాయి. మొన్న వారం రోజులు వరుసగా వర్షాలు పడ్డాయి. అప్పుడు ప్యాలస్ బ్రోకర్ సజ్జల పరిగెత్తుకుంటూ జగన్ దగ్గరకు వెళ్లాడు.

సార్ సెంటు స్థలాలు అన్ని మునిగిపోయాయి పునాదులు కూడా కనపడటం లేదు అన్నాడు. జనం గోల పెడుతున్నారు అన్నాడట.అప్పుడు జగన్ ప్యాలస్ బ్రోకర్ ని రెండు పీకాడు. ఈత కొట్టుకుంటూ వెళ్లు పునాదులు కనిపిస్తాయి అన్నాడు. జగన్ కడుతున్న ఇళ్లు సంసారానికి పనికిరావు అని వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే మరీ అంత ఘోరంగా కడుతున్నారా అనుకున్నా. కానీ ఇప్పుడు కొన్ని వీడియోలు చూసా, చేత్తో తోస్తే గోడలు పడిపోతున్నాయి. అంత చెత్త ఇళ్లు కడుతున్నాడు జగన్. ఇప్పటి వరకూ ఇందిరమ్మ ఇళ్లే లో క్వాలిటీ. ఆ రికార్డ్ ని జగన్ బద్దలుకొట్టాడు. మీకో చిన్న క్విజ్ పెడతాను. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, వైసిపి ఎంపీలు ఢిల్లీ లో ఎం పీకుతున్నారు? ఆప్షన్1. అవినాష్ జైలు కి వెళ్లకుండా లాబీయింగ్ చేస్తున్నారు. ఆప్షన్2. ప్యాలస్ బ్రోకర్ సజ్జల ని సీబీఐ అరెస్ట్ చెయ్యకుండా ఆపే పనిలో బిజీగా ఉన్నారు. ఆప్షన్3. జగన్, ఆయన భార్య భారతి రెడ్డి గారిని సీబీఐ ఎంక్వైయిరి చెయ్యకుండా ఆపడానికి ఢిల్లీ పెద్దలు కాళ్లు పట్టుకుంటున్నారు. ఆప్షన్4. ఆల్ ది ఎబోవ్.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు జగన్. ప్రజలు 31 మంది ఎంపీలను ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధించాల్సిన వైసిపి ఎంపీలు రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు. ఒక ఎంపీ మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక ఎంపీ యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేసుకునే పనిలో బిజీ గా ఉన్నాడు. ఒక ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుకున్న కొడుకు ని కాపాడే పనిలో ఉన్నాడు. ఒక ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయాడు. ఏ2 ఎంపీ ఏ స్కాం లో ఎంత వచ్చిందో లెక్కలు వేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఏ1 ప్యాలస్ లో పడుకున్నాడు. 31 ఎంపీలను యువత గెలిపిస్తే జగన్ యువత చేతికి చిప్ప ఇచ్చాడు. జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు. బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.

జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.

జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2,200 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.

యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది.

ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు.జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ లో ఎన్నో పదవులు అనుభవించి కొంత మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ థాంక్స్. వారు వెళ్లిపోయిన తర్వాత పార్టీ బలోపేతం అయ్యింది. వైసిపి కి ఇప్పుడు 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు.

నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది.రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. 8వ సారి ఛాలెంజ్ విసురుతున్నా 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు చర్చకు రండి. ఎవరి హయాంలో ప్రకాశం అభివృద్ధి చెందిందో చర్చకు నేను రెడీ. దర్శి రూపురేఖలు మార్చేస్తాడని భారీ మెజారిటీతో మీరు మద్దిశెట్టి వేణుగోపాల్ ని గెలిపించారు. దర్శి అభివృద్ధి చెందిందా? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వేణుగోపాల్ జీవితం మాత్రం మారిపోయింది. హైదరాబాద్ లో 7 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, దర్శి నియోజకవర్గంలో 80 ఎకరాల భూమి కొన్నాడు, మార్టూరు లో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కొన్నాడు.

దర్శి ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడు. అందుకే ఆయన పేరు మార్చా ఆయన పేరు వేణుగోపాల్ కాదు కలక్షన్ గోపాల్. తమ్ముడు శ్రీధర్ తో పాటు 5 మండలాలకు ఐదుగురు బంధువులను కలక్షన్ ఏజెంట్లు గా నియమించాడు. బోదనంపాడు గ్రామంలో సర్వే నెం. 227 లో దళితులకు చెందిన 25 ఎకరాల భూమిని కబ్జా చేసాడు కలక్షన్ గోపాల్. పోలవరం ఇసుక రీచ్ ల నుండి కోట్లాది రూపాయల ఇసుక దోచేస్తున్నాడు కలక్షన్ గోపాల్. దోపిడీ లో కలక్షన్ గోపాల్ రూటే సెపరేటు. దర్శి లో ఏ అధికారిని ఎక్కువ కాలం పనిచెయ్యనివ్వడు కలక్షన్ గోపాల్ ఎందుకో తెలుసా? ఎస్సై పోస్టు 15లక్షలు, సిఐ కి 20 లక్షలు, తహసీల్ధార్ కి 20 లక్షలు. వైసిపి సర్పంచులు, కార్యకర్తలను కూడా వదలలేదు కలక్షన్ గోపాల్. ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా లక్షకు 10 వేలు కమిషన్ ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలన్నా కలక్షన్ గోపాల్ కి కప్పం కట్టాల్సిందే. సర్పంచ్, ఎంపిటిసి కి 20 లక్షలు, ఎంపిపి, జెడ్పిటిసి లకు 30 లక్షల నుండి కోటి రూపాయల వరకూ రేటు పెట్టి అమ్మేసాడు. సింగిల్ విండో, ఏఎంసి ఛైర్మెన్ పదవులు కూడా వేలం వేసి అమ్మేసాడు. జనాలు ఉండలేని చోట సెంటు స్థలాలు ఇచ్చి లెవెలింగ్ పేరుతో రూ.3 కోట్లు కొట్టేసాడు. దర్శిలో ఎవరు వెంచర్ వెయ్యాలన్నా ఎకరానికి రూ.5 లక్షలు కప్పం కట్టాల్సిందే.

కలక్షన్ గోపాల్ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకి ఎక్స్ పోర్ట్ చేస్తాడు. బల్లు ఖాళీగా రాకుండా వచ్చేప్పుడు ఇతర రాష్ట్రాల లిక్కర్ తెప్పిస్తాడు. కలక్షన్ గోపాల్, ఆయన అనుచరులు కలిసి గ్రావెల్ దందా చేస్తున్నారు. కలక్షన్ గోపాల్ చేసిన అవినీతి మొత్తం చెప్పాలి అంటే ఒక రోజు పడుతుంది. గ్రామాలు, మండలాల వారీగా దోపిడీ వివరాలు త్వరలోనే మా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతారు. దర్శిని అభివృద్ధి చేసింది టిడిపి. రూ.2 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. గ్రామాల్లో సిసి రోడ్లు, డబుల్ రోడ్లు, బ్రిడ్జ్ లు,పేదలకి ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. కురిచేడులో గురుకుల పాఠశాల, దర్శిలో పల్లె వనం పార్క్, పశువుల ఆసుపత్రి భవనం, ట్రెజరీ బిల్డింగ్ నిర్మించాం. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసాం.2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. దర్శి లో టిడిపి జెండా ఎగరేయండి. దర్శి చరిత్ర లో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తాం. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తాం. దర్శి లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. దర్శి సమీపంలో ఉన్న ఎన్ఏపి చెరువు దగ్గర ఫిల్టర్ బెడ్స్ చెడిపోతే రిపేర్ చేసే దిక్కులేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిల్టర్ బెడ్స్ మారుస్తాం.

మూసి నదిపై వంతెన నిర్మిస్తాం. వెలిగొండ పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. మొగిలి గుండాల రిజర్వాయర్ నిర్మిస్తాం. గుండ్లకమ్మ నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేసి మోదేపల్లి నుండి గ్రామాలకు సాగునీరు అందిస్తాం. పొగాకు, మొక్కజొన్న, వరి, మిర్చి రైతుల సమస్యలు నేను చూసాను. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. 17 రోజులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించాను. 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసాను. నన్ను ప్రజలు ఆదరించారు. మీరు చూపించిన ప్రేమ ఎప్పుడూ మర్చిపోలేను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. భయం మా బయోడేటా లో లేదు. కేసులకు భయపడేది లేదు. ఎక్కువ కేసులు ఎవరి మీద ఉంటే వారికే నామినేటెడ్ పదవులు ఇస్తాం.

Tags: Latest Political NewsMundlamuru Public MeetingNara lokeshTelugu Desam Partyyuvagalamyuvagalam in darsiyuvagalam padayatra
Previous Post

LIVE : సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమలో భాగంగా నందికొట్కూరులో చంద్రబాబు గారి రోడ్డు షో

Next Post

LIVE : “సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి” నందికొట్కూరులో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ.

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

బలగాల హేతుబద్దీకరణ!

చైతన్యరధం
@ March 13, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist