దేశంలోనే ధనిక సిఎం ని పేదలు ఓడించటమే నిశ్శబ్దయుద్ధం
పేదరికం లేని రాష్ట్రమే టిడిపి అజెండా
వేధించిన వైసీపీ నాయకులు బంగ్లాదేశ్ లో వున్నా పట్టుకొచ్చి లోపలేస్తాం
లక్ష రూపాయల చెప్పులు వేసుకునేవాడు పేదవాడా?
అనారోగ్యశ్రీ గా మారిన ఆరోగ్యశ్రీ
బనగానపల్లి బహిరంగసభలో ధ్వజమెత్తిన లోకేష్
జగన్ 2024 లో క్లాస్ వార్ జరుగుతుంది అంటున్నాడు. జరగబోయేది సైలెంట్ వార్ నిశ్శబ్ద యుద్ధం. పేదలు దేశంలోనే ధనిక సీఎం జగన్ ని ఓడించడమే నిశ్శబ్ద యుద్ధం.
పేదరికం లేని రాష్ట్రం టిడిపి ఎజెండా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం బనగానపల్లి లో జరిగిన భారీ బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలి అన్నది జగన్ కల. జగన్ కి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. అందుకే ఆయనకి బిల్డప్ బాబాయ్ జగన్ అని పేరు పెట్టా అని లోకేష్ చెప్పారు. టిడిపి కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఏఒక్కరిని వదిలి పెట్టను. బనగానపల్లెను అభివృద్ధి చేసింది బిసి జనార్దన్ రెడ్డి. మీ తరపున పోరాడింది బిసి జనార్దన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని 31 రోజులు జైల్లో పెట్టారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వైసిపి నాయకులు బనగానపల్లెలో ఉన్నా బంగ్లాదేశ్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలవేస్తాం అని లోకేష్ హెచ్చరించారు. సాగానిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. ఎవడు వస్తాడో రండి అని సవాల్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు ఆలోచించాలి. 2014 ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినా విమానాశ్రయం, మెగా సోలార్ పార్క్, మెగా సీడ్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది టిడిపి.
2019 లో 14 మంది వైసిపి ఎమ్మెల్యేలను గెలిపించారు. టిడిపి చేసిన దాంట్లో 10 శాతం అభివృద్ది కూడా చెయ్యలేదు. 2024లో 14కి 14 సీట్లు గెలిపించండి కర్నూలు జిల్లాని నంబర్ 1 చేస్తాం అని లోకేష్ మీ ఇచ్చారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి, నందవరం చౌడేశ్వరి దేవి ఆలయం ఉన్న నేల బనగానపల్లె. బనగానపల్లె మామిడి దేశం మొత్తం ఫేమస్. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన పవిత్ర నేల బనగానపల్లె. బనగానపల్లెని పట్టిపీడించిన ఫ్యాక్షన్ లేకుండా చేసి ప్రజలు ప్రశాంతగా ఉండేలా చేసింది చంద్రబాబు గారు.ఎంతో ఘన చరిత్ర ఉన్న బనగానపల్లె భూమి పై పాదయాత్ర చెయ్యడం అదృష్టం.యువగళం. మనగళం. ప్రజాబలం. అని లోకేష్ చెప్పారు. మనది సైకిల్ ప్రభుత్వం. జగన్ ది సైకో ప్రభుత్వం. బాబు గారు మొనగాడు. జగన్ శనిగాడు. బాబు గారిది మంచి పాదం. జగన్ ది దరిద్ర పాదం.
టిడిపి హయాంలో నీళ్లు. జగన్ హయాంలో కన్నీళ్లు అని విమర్శించారు. జిఓ.1 తెచ్చిన ఏ1కి ఏడుపే మిగిలింది. నేను అప్పుడే చెప్పా జీఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో ఏ1 అని.
పీకడానికి ఏమి లేక యువగళాన్ని అడ్డుకోమని సైకో సైన్యాన్ని పంపుతున్నాడు. భయం మా బయోడేటా లో లేదు బ్రదర్.యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తాం అని హెచ్చరించారు. జగన్ గుంట నక్క కంటే ప్రమాదం. జగన్ ని చూస్తే తన కంటే మోసగాళ్లు ఉన్నారని గుంట నక్క సైతం ఆశ్చర్యపోవడం ఖాయం.
జగన్ నిస్సిగ్గుగా పేదవాడిని అని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని ప్రశ్నించారు. బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా?సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నవాడు పేదవాడా?జగన్ కి నేనో బంపర్ అఫర్ ఇస్తున్నా ఉన్న లక్ష కోట్ల ఆస్తి లో 90 వేల కోట్లు ప్రజలకు పంచు లేదా ప్రభుత్వానికి ఇవ్వు. నువ్వు పేదవాడివని నేనే ఒప్పుకుంటా అని లోకేష్ వెల్లడించారు.
వెయ్యి దాటిన ఏ రోగానికైనా ఆరోగ్యశ్రీలో చికిత్స అన్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నే అనారోగ్యశ్రీ గా మార్చేసాడు. రూ.1200 కోట్ల బకాయిలు పెట్టాడు. బిల్లులు పూర్తిగా చెల్లించే వరకూ చికిత్స చెయ్యం అని
ప్రైవేట్ ఆసుపత్రులు అంటున్నాయి. ఆరోగ్య శ్రీ ఎత్తిపోయింది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, మందులు లేవు. బిల్డప్ బాబాయ్ జగన్ మాత్రం ప్రతి ఇంటికి డాక్టర్ ని పంపుతా అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు అని లోకేష్ విమర్శించారు. సెంటు స్థలాలు, ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చాడు బిల్డప్ బాబాయ్ జగన్. ఇప్పుడు అప్పు చేసి మీరే కట్టుకోండి లేకపోతే స్థలం వెనక్కి ఇవ్వండి అంటున్నాడు. సెంటు స్థలాల కోసం బీసీ,ఎస్సి, ఎస్టీ, రైతుల పోలాలు తీసుకున్నారు. వారికి పరిహారం కూడా ఇవ్వలేదు. రూ.800 కోట్లు బకాయిలు పెట్టాడు. పరిహారం ఇవ్వకుండా బీసీ,ఎస్సి, ఎస్టీ, రైతులను అధికారుల చుట్టూ తిప్పుతున్నాడు బిల్డప్ బాబాయ్ జగన్.
ప్రజా ధనాన్ని లూటీ చేయడం లో బిల్డప్ బాబాయ్ జగన్ రూటే సెపరేటు అని ఎద్దేవా చేశారు. వివిధ దేవాలయాలకు చెందిన సొమ్ము రూ.7 కోట్లతో యాగాలు నిర్వహించారు. యాగాలు చేసినప్పుడు సీఎం స్థానంలో ఉన్నవాడు ఏమని కోరుకోవాలి?రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకోవాలి. కానీ బిల్డప్ బాబాయ్ జగన్ ఏమి కోరుకున్నాడో తెలుసా? శత్రువులు పోవాలి. కోర్టుల్లో గెలవాలి అని కోరుకున్నాడు.బిల్డప్ బాబాయ్ జగన్ క్రూరమైన మనస్తత్వం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి. జీవితం అంతా పాపాలు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? బిల్డప్ బాబాయ్ జగన్ పాపాలు పండాయి. అందుకే సీబీఐ వెంటాడు తుంది అని పేర్కొన్నారు. బాబాయ్ ని లేపేసినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు ఎందుకు లేదు? సీబీఐ అనగానే జగన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతాడు.
అవినాష్ పారిపోతాడు. అప్పుడు బాబాయ్ కి గుండెపోటు అన్నారు. ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు. అవినాష్ తల్లి ని ఎం చేస్తాడా అని భయం వేస్తుంది. ఆ తల్లి జాగ్రత్తగా ఉండాలి అని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను.ఏ తప్పూ చెయ్యకపోతే విచారణ కు వెళ్లకుండా ఎందుకు పారిపోతున్నారు.ఇప్పుడు చెప్పండి అమ్మా హూ కిల్డ్ బాబాయ్? అబ్బాయ్ కిల్డ్ బాబాయ్. వివేకా గారి హత్య కేసులో అవినాష్, జగన్ దంపతులు జైలుకి పోయే ముహూర్తం దగ్గరకు వచ్చింది అని లోకేష్ వెల్లడించారు.
బిల్డప్ బాబాయ్ జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా అని లోకేష్ పేర్కొన్నారు. బిల్డప్ బాబాయ్ జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.
బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే
బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే
బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. బిల్డప్ బాబాయ్ జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి అని డిమాండ్ చేశారు.
బిల్డప్ బాబాయ్ జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ క్విడ్ ప్రో కో జగన్. బిల్డప్ బాబాయ్ జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
బిల్డప్ బాబాయ్ జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2200 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు అని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు. బిల్డప్ బాబాయ్ జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. బిల్డప్ బాబాయ్ జగన్
పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి అని విమర్శించారు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమలో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు, మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు అని లోకేష్ హెచ్చరించారు. బిల్డప్ బాబాయ్ జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు.
ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. మైనారిటీలను మోసం చేసాడు బిల్డప్ బాబాయ్ జగన్ అని లోకేష్ విమర్శించారు. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు.ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకూ దోషులకు శిక్షపడలేదు. నంద్యాలలో ఆర్టీఓ వేధింపులు తట్టుకోలేక కరిముల్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.ముగ్గురు పిల్లలతో కరిముల్లా భార్య పడుతున్న బాధలు జగన్ కి కనపడవు. ఇప్పటి వరకూ దోషులకు శిక్ష పడలేదు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలులో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు. ఈ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి అని పోరాటం చేసింది టీడీపీ అని చెప్పారు.టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
బిల్డప్ బాబాయ్ జగన్ దళిత ద్రోహి అని లోకేష్ ధ్వజమెత్తారు. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు
కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు.
ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా?సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు.
వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు.దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసాడు జగన్. టిడిపి గెలిచిన వెంటనే దళితుల 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం అని లోకేష్ వెల్లడించారు.
బీసీల బ్యాక్ బోన్ విరిచాడు బిల్డప్ బాబాయ్ జగన్ అని విమర్శించారు. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం
రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత
కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.