జగన్ ప్రతిపక్ష నేతగా పెనుకొండ నియోజకవర్గం లో చేసిన ప్రసంగాన్ని నారా లోకేష్ విడుదల చేశారు. ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో కియా పరిశ్రమ కోసం బలవంతంగా అప్పటి ప్రభుత్వం భూములు తీసుకుంటుందంటూ జగన్ చేసిన ప్రసంగాన్ని విడుదల చేసి జగన్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు.
మూడు పంటలు పండే భూములను అప్పటి సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారంటూ అప్పట్లో జగన్ ఆరోపణలు చేశారు. భూములు ఎవరు ఇవ్వద్దంటూ మీకు అండగా నేను ఉంటాను, అంటూ అప్పట్లో జగన్ ప్రసంగించారు. వచ్చిన కంపెనీలు వెనక్కి పంపి భూములు వెనక్కి ఇస్తానని జగన్ ప్రకటించారు.ఇప్పుడు అవే భూముల్లో కియా పరిశ్రమ వచ్చి వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అంటూ జగన్ ను నారా లోకేష్ ప్రశ్నించారు.