కావలి లో మాస్ జాతర అదిరిపోయింది. పోరాటాల గడ్డ కావలి. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నివసించిన నేల కావలి. బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి కావలి. కావలి లోనే 150 రోజుల మైలురాయి ని చేరుకున్నా, కావలి లోనే 2000 కిలోమీటర్ల మైలరాయిని చేరుకోబోతున్నాను. ఎంతో ఘన చరిత్ర ఉన్న కావలి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. నెల్లూరు జిల్లాలో యువగళం ఒక ప్రభంజనం. యువ గళం ప్రభంజనం చూసి జగన్ కి భయం, భయం, భయం…ఈ మధ్య జగన్ మాటలు విన్నారా? భయంతో మాట్లాడుతున్నాడు. జగన్ పనైపోయింది. యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసింది. ఆఖరికి అమ్మని చూసినా జగన్ కి భయం, చెల్లిని చూసినా జగన్ కి భయం.
జగన్ ఈ మధ్య పదే పదే నేను మీ బిడ్డని అంటున్నాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆస్తి మొత్తం లాగేసి కన్న తల్లిని, చెల్లిని గెంటేసాడు అయినా ఆస్తి పై దాహం తగ్గలేదు. ఇంకో ఛాన్స్ ఇస్తే నేను మీ బిడ్డనే కదా అని మీ ఇళ్లు, పొలాలు, ఆస్తులు రాసివ్వండి అని లాక్కుంటాడు. జగన్ ఒక జబర్దస్త్ కమిడియన్. ఈ మధ్యే ఏపీకి కూడా ఐపీఎల్ క్రికెట్ టీం ఉండాలి అన్నాడు. నేషనల్ గేమ్స్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కి ఆర్థిక సాయం చెయ్యని వాడు ఐపీఎల్ క్రికెట్ టీం గురించి మాట్లాడుతున్నాడు. స్టేడియం లో ప్రాక్టీస్ చెయ్యడానికి వెళ్లే ప్లేయర్స్ కి ఎంట్రీ ఫీజు పెట్టి దోచుకుంటున్న జగన్ ఐపీఎల్ టీం పెడతాడా? జగన్ ఐపీఎల్ అనగానే సోషల్ మీడియా లో జనాలు ఒక ఆట ఆడుకున్నారు. ఈ మధ్యే ఒక పోస్ట్ చూసా, సైకో జగన్ ఏపీకి ఐపీఎల్ టీం ఉంటే ఏమి పేరు పెడతాడు అని? ఆప్షన్స్ చూసి నాకు నవ్వు ఆగలేదు, ఆప్షన్స్ ఏంటో తెలుసా? 1) త్రీ క్యాపిటల్స్ 2. కోడి కత్తి వారియర్స్ 3. జేసీబీ నైట్ రైడర్స్ 4. బూమ్ బూమ్ ఛాలెంజర్స్.
ఇప్పుడు మీకో క్విజ్ పెడతాను. జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడు? మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 అవినాష్ కి కాపాడటానికి. రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి. మూడో ఆప్షన్. భార్య భారతీ రెడ్డి గారిని కేసు నుండి తప్పించాడనికి. నాలుగో ఆప్షన్. ఆల్ ది ఎబోవ్. ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? జగన్. పిన్ని తాళి తెంచింది ఎవరు? జగన్. చెల్లిపై నిందలు వేసింది ఎవరు? జగన్. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర. జగన్ కులం క్యాష్… జగన్ మతం క్యాష్. ఈ మాట నేను ఊరికే అనడం లేదు. కల్యాణదుర్గం లో జగన్ రైతు దినోత్సవం కార్యక్రమం పెట్టాడు. దేశానికే అన్నం పెట్టే రైతన్నను అవమానించాడు జగన్. భోజనం బాగోలేదు, తినడానికి ప్లేట్లు లేవు, సభకి వచ్చిన రైతులు అట్ట ముక్కల్లో అన్నం పెట్టారు. అట్ట ముక్కల్లో అన్నం తింటున్న రైతుల్ని చూసిన తరువాత పేదలంటే జగన్ కి ఎంత కక్షో అర్థమైంది. రైతులన్నా, ప్రజలన్నా జగన్ కి చిన్న చూపు.
జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకో రేప్, రోజుకో మర్డర్. విశాఖని జగన్ క్రైం క్యాపిటల్ గా మార్చేసాడు. మొన్నే ఎంపీ భార్యా, కొడుకు కిడ్నాప్ అయ్యారు. ఇప్పుడు పదో తరగతి చదువుతున్న అమ్మాయి పై గ్యాంగ్ రేప్ జరిగింది. గన్ కంటే ముందు వస్తాడు అన్న జగన్ ఎక్కడ పడుకున్నాడు. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, చిక్కుడు ధర రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే స్టిక్కర్ ఇంటికి కాదు… కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా వెయ్యాలి.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు.
బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది.
ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి కష్టపడి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం దక్కడం లేదు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది టిడిపి మాత్రమే. కావలి కనకపట్నంగా మారుతుందని బ్రహ్మం గారు చెప్పారు.
కావలిని కనకపట్నంగా మార్చేస్తారని మీరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని రెండు సార్లు గెలిపించారు. ఆయన కావలిని కష్టాలపట్నంగా మార్చేసాడు. ఆయనకి పేరులో మాత్రమే ప్రతాపం ఉంది మనిషిలో ప్రతాపం లేదు. ప్రశాంతంగా ఉండే కావలి అరాచకాలకు అడ్డాగా మార్చేసాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా కు కావలి ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసాడు. ఆయన చేసిన అవినీతి గురించి, అరాచకాల గురించి తెలుసుకున్న తరువాత ఆయనకి ముద్దుగా అనకొండ అని పేరు పెట్టాను. దోచుకోవడం, దాచుకోవడం కావలి అనకొండ స్పెషాలిటీ. ఆఖరికి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా వదలడం లేదు ఈ అనకొండ. కప్పరాల తిప్పలో బిసి గురుకుల పాఠశాల కు చెందిన 4 ఎకరాల భూమిని అనకొండ, ఆయన బినామీ బాల మురళీ రెడ్డి కబ్జా చేసాడు. సెంటు స్థలాల పేరుతో భారీ స్కాం కి పాల్పడ్డాడు అనకొండ. 15 లక్షలు కూడా విలువ చేయని భూములను తన బినామీల యాదగిరి, సుబ్బారావు, ప్రభాకర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, వెంకట రామిరెడ్డి, రాణమ్మ, శివ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ద్వారా కొని ఎకరం 50 లక్షలకు ప్రభుత్వానికి అమ్మేసాడు ఈ అనకొండ. సెంటు భూముల్లో అనకొండ అవినీతి ఎంతో తెలుసా? అక్షరాలా రూ.100 కోట్లు. అవినీతి కి సహకరించలేదని ఏకంగా కలెక్టర్ నే ట్రాన్స్ ఫర్ చేయించాడు అనకొండ.
అనకొండ అనుచరులు వివేక్ రెడ్డి, ప్రసాద్, మహేష్ నాయుడు, రఘు, వెంకట్ తో కలిసి కావలి రూరల్, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాలో విచ్చలవిడిగా గ్రావెల్ ను తవ్వి కోట్లు సంపాదించారు. ప్రతి రోజూ 300 లారీల గ్రావెల్ లేపేస్తున్నాడు అనకొండ. ఇసుక అక్రమ రవాణాకు కావలిని అడ్డాగా మార్చేసాడు. సముద్రపు ఇసుక మిక్స్ చేసి మరీ ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నాడు ఈ అనకొండ. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కలక్షన్ పాయింట్ గా మార్చుకున్నాడు అనకొండ. ప్రతి రిజిస్ట్రేషన్ కి కప్పం కట్టాల్సిందే. రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా అనకొండ ఒక రోజు కలక్షన్ ఎంతో తెలుసా? రూ.15 లక్షలు. కావలిని అక్రమ లే అవుట్లకు కేంద్రంగా మార్చేసాడు. అక్రమ లే అవుట్లు వేసే వారి దగ్గర ఎకరాకు 10 నుండి 15 లక్షలు వసూలు చేస్తున్నాడు ఈ అనకొండ. కావలికి చెందిన దళితుడు కరుణాకర్ ని వేధించి చంపేసాడు ఈ అనకొండ. కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువుని లాక్కుని హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసారు. అనకొండ దళితుడు కరుణాకర్ ని మింగేస్తే, మీ లోకేష్ కరుణాకర్ కుటుంబాన్ని ఆదుకున్నాడు. తనకా పెట్టిన ఇంటిని విడిపించి కరుణాకర్ కుటుంబానికి ఇచ్చింది మీ లోకేష్. కరుణాకర్ ఏ పార్టీకి చెందిన వాడో మీకు తెలుసా? వైసిపి. అంటే సొంత పార్టీ కార్యకర్తలను కూడా మింగేసాడు ఈ అనకొండ.
దళిత యువకుడు హర్ష ను పార్టీలో చేరమని అక్రమ కేసులు పెట్టి వేధించాడు అనకొండ. ఎమ్మెల్యే ఇంటి ముందు హర్ష పురుగుల మందు తాగాడు. అతనికి వైద్యం చేయించింది టిడిపి పార్టీ. పెట్రోల్ బంక్ లో పనిచేసే దళిత యువకుడు తేజపై అనకొండ గ్రావెల్ మాఫియా దాడి చేసి దారుణంగా కొడితే నో కేస్. అనకొండ అవినీతిని ప్రశ్నిస్తే మహిళల మీద దాడులు, మీడియా వారిపై దాడులు, దళితుల పై దాడులు. టిడిపి హయాంలో కావలి అభివృద్ధి లో నంబర్ 1. రోడ్లు, సిసి రోడ్లు, పేదలకు ఇళ్లు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. ఆక్వా ఎగుమతుల్లో కావలిని నంబర్1 చేసాం. నీరు చెట్టు పధకం కింద చెరువులను అభివృద్ధి చేసాం. మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, మోటారు బోట్లు, ఆటోలు, ట్రక్కులు, ఐస్ బాక్స్‌లు ఇచ్చాం. ఫిషింగ్ హార్బర్ తెచ్చింది టిడిపి. కానీ మీరు ఏం చేసారు.. పాలిచ్చే ఆవుని వద్దనుకోని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అనకొండ ఎంత చేతగాని వాడో నేను చెప్పడం కాదు, నియోజకవర్గం లో వైసిపి నేతలు, కార్యకర్తలే ఒక పాంప్లెట్ వేసి పంచుతున్నారు. ఇదిగో నాకు కూడా ఇచ్చారు. అనకొండ కావలిని దోచుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ పాంప్లెట్ వేసారు.
అనకొండే కాదు, జగన్ కూడా కావలి ప్రజల్ని మోసం చేసాడు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం రూ.35 కోట్లు, బైపాస్ కెనాల్ కు రూ.20 కోట్లు, ట్రంక్ రోడ్డు విస్తరణకు రూ.15 కోట్లు, ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాల కోసం రూ.80 కోట్లు కేటాయించాడు. కావలికి సీఎం కేటాయించిన రూ.150 కోట్లు ఎక్కడ? ఒక్క రూపాయి వచ్చిందా? ఒక్క పని పూర్తి అయ్యిందా? అనకొండ వేసిన శిలాఫలకాలు తప్ప అభివృద్ధి అడ్రస్ లేదు. ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు బబుల్ గమ్ లా సాగుతూనే ఉన్నాయి. పనులు పూర్తి చెయ్యడు. తుమ్మలపెంట రోడ్డు ఘోరంగా ఉంది. ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నా అనకొండ రోడ్డు వెయ్యడు. టిడిపి హయాంలో డబ్బులు కేటాయించినా కమిషన్ కోసం పనులు ఆపేసాడు. కావలి టౌన్ ని 100 గ్రామాలతో అనుసంధానం చేసే పెద్దపవని ఫ్లైఓవర్ పనులు పూర్తి చెయ్యలేని వేస్ట్ ఎమ్మెల్యే ఈ అనకొండ. కావలి లో డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. చిన్న వర్షం వస్తే డ్రైనేజ్ పొంగి ప్రజలు నరకం చూస్తున్నారు. కావలి పట్టణ ప్రజలు దాహంతో అల్లాడిపోతుంటే, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి నీటిని అందించింది టిడిపి. మిగిలిన పనులు పూర్తి చెయ్యలేని చెత్త ఎమ్మెల్యే ఈ అనకొండ.
కావలి టౌన్ లో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. రకరకాల పన్నుల పేరుతో ప్రజల్ని, వ్యాపారస్తులను వేధించి మున్సిపాలిటీ పరిధిలో పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు. మున్సిపాలిటీ నిధులు మాత్రం స్వాహా చేస్తున్నాడు అనకొండ. అనకొండ వేసిన శిలాఫలకాల లిస్ట్ చదువుతాను అవన్నీ అయ్యాయో లేదో మీరే చెప్పాలి. పార్కులు, రోడ్లు, బ్రిడ్జ్ లు, శ్మశానాలు, ఇండోర్ స్టేడియం, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్, ఇందిరమ్మ కాలనీ వద్ద రైల్వే అండర్ పాస్… వీటిలో ఒక్క పని అయినా పూర్తి అయ్యిందా? ఎలాగో అనకొండ ఇంటికి పోయే టైం దగ్గర పడింది. ఆయన వేసిన శిలాఫలకాలు అన్ని ఆయన ఇంటికే పంపుదాం. అతని చేతగాని తనానికి గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాడు. మేం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పిల్ల కాలువల ద్వారా సాగు నీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.
టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. పెండింగ్ లో ఉన్న రోడ్లు, బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తాం. దగదర్తి విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తాం. మత్స్యకారులు జగన్ పాలనలో పడుతున్న భాదలు నాకు తెలుసు. గతంలో ఎలా అయితే వలలు, బొట్లు, డీజిల్ సబ్సిడీలు ఇచ్చామో, టిడిపి అధికారంలోకి వచ్చిన వాటన్నింటినీ మీకు అందజేస్తాం. వరి రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు టిడిపి హయాంలో ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి అయితే జగన్ పాలనలో రూ.40 వేలు అవుతుంది. ఒక్క నెల్లూరు జిల్లా లోనే నాలుగేళ్లలో రైతులు రూ.3,400 కోట్లు నష్టపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. అనకొండ భూ అక్రమాల పై సిట్ వేస్తాం. మింగిన డబ్బు మొత్తం కక్కిస్తాం. పేద ప్రజలకి పంచుతాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని అనకొండ వేధించాడు. టిడిపి కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తాం. భయం నా బయోడేటా లో లేదు. టిడిపి కార్యకర్తల్ని వేధించిన వారు కావలిలో ఉన్నా కాంబోడియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.