174వరోజు యువగళం పాదయాత్ర గురువారం నగరాయపాలెం క్యాంఫ్ సైట్ నుంచి ప్రారంభమైంది. సైకో ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తూ జనప్రభంజనమై సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద 2300 కి.మీ. మైలురాయికి చేరుంది. ఈ సందర్భంగా వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ ఇస్తూ యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అంది పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుంది.
బొల్లాపల్లి మండలంలో ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకున్నారు. మరికొద్ది నెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. నగరాయపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొండ్రుముట్ల, సత్యనారాయణపురం, కొచ్చెర్ల, అంగలూరు మీదుగా వనికుంట విడిది కేంద్రానికి చేరుకుంది.
174వరోజు యువనేత లోకేష్ 13.9 కి.మీ.లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2313.5 కి.మీ. మేర పూర్తయింది. సాక్షి తప్పుడు కథనాలపై మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న కారణంగా 4-8-2023న లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. 5వతేదీ ఉదయం వనికుంట నుంచి యథావిధిగా పాదయాత్ర ప్రారంభమవుతుంది.