యువగళం పాదయాత్రలో నున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు.
యువగళం పాదయాత్ర లో భాగంగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రవేశించినప్పుడు భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయం అయింది.
అయినప్పటికి ఆ నొప్పిని పంటిబిగువున భరిస్తూనే లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గత 50 రోజులుగా ఆ నొప్పితోనే లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
వైద్యులు, ఫిజియోథెరపిస్ట్ లు సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికి నొప్పి తగ్గకపోవటంతో ఎం ఆర్ ఐ స్కాన్నింగ్ చేయించాలని వైద్యులు సూచించారు.
వైద్యుల సూచన మేరకు నంద్యాల లోని మ్యాగ్నా ఎం ఆర్ ఐ సెంటర్ లో గురువారం లోకేష్ కు స్కానింగ్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.