సంఘీభావంగా నందమూరి, నారా కుటుంబాలు
అందరివాడైన కుమారుడితో కలిసి భువనేశ్వరి అడుగులు
అపూర్వదృశ్యాన్ని చూసేందుకు పోటెత్తిన జనవాహిని
అభిమానుల ఉత్సాహం నినాదాల హోరుతో జాతరను తలపించిన యువగళం
మోతుకూరు వద్ద పైలాన్ ఆవిష్కరణ,
వందమొక్కలు నాటిన టిడిపి నాయకులు
టిటిడిపి నాయకుల సంఘీభావం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర నూరవ రోజుకు చేరుకున్న సందర్భంగా సోమవారం అపూర్వ దృశ్యం ఆవిష్కృతం అయింది. తెలుగుజాతికి
వైభవప్రాభవాలు, వెలుగును ప్రసాదించిన నందమూరి, నారా కుటుంబాలకు చెందిన వారంతా పాదయాత్ర ప్రాంతానికి తరలివచ్చి లోకేష్ కు సంఘీభావం ప్రకటించారు. ఒక ముఖ్యమంత్రి తనయగా, మరో
ముఖ్యమంత్రి భార్యగా వున్న నారా లోకేష్ మాతృమూర్తి నారా భువనేశ్వరి తొలిసారి బహిరంగంగా పాదయాత్రలో పాల్గొనటం విశేషం.
యువగళం పాదయాత్రతో అందరివాడుగా మారిన కుమారుడిని భువనేశ్వరి ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారు. జనహృదయ విజేతగా నిలిచిన కుమారునితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మాతృత్వదినోత్సవ సందర్భంగా ఆదివారం సాయంత్రమే తన కుమారునివద్దకు వెళ్ళిన భువనేశ్వరి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. యువగళం నూరవ రోజుకు చేరుకున్న సందర్భంగా సోమవారం నాడు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేష్ చిన్ననాటి స్నేహితులు పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ అపూర్వ దృశ్యాన్ని కళ్ళారా చూసేందుకు అభిమానులు, టిడిపి శ్రేణులతో పాటు సాధారణ ప్రజానీకం సైతం పోటెత్తారు. యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం లోని మోతుకూరు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అదే ప్రాంతంలో పాదయాత్రకు గుర్తుగా టిడిపి నాయకులు వంద మొక్కలు నాటారు. జయ లోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో పాదయాత్ర మార్గమంతా హోరెత్తింది. నినాదాల హోరు, బాణాసంచా మోతలు, డప్పుల చప్పులతో యువగళం పాదయాత్ర జనజాతరలా సాగింది.
పాదయాత్రలో నారా భువనేశ్వరి తో పాటు వారి కుటుంబ సభ్యులైన లోకేశ్వరి, హైమవతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్, నందమూరి మణి, సి హెచ్ శ్రీమాన్, సి హెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ళ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా యువగళం పాదయాత్ర నూరవ రోజుకు చేరుకున్న సందర్భంగా తెలంగాణ నుంచి వచ్చిన పార్టీ నాయకులు లోకేష్ కు శుభాకాంక్షలు చెప్పి అభినందించారు. టిటిడిపి అధ్యక్షులు కాసాని
జ్ఞానేశ్వర్, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరాం తదితరులు ప్రత్యేకంగా పాదయాత్రలో పాల్గొని లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. వారిలో మాజీ మంత్రులు పీతల సుజాత, అమర్నాధ రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీడా రవిచంద్ర యాదవ్, శ్రీశైలం నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ బుడ్డా రాజశేఖర రెడ్డి, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు, డూండీ రాకేష్, యువగళం మీడియా కో ఆర్డినేటర్, బివి వెంకటరాముడు, భాష్యం ప్రవీణ్ తదితరులున్నారు.