పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు హామీ
నంద్యాల రూరల్ మండలం కానాలలో శిలాఫలకం ఆవిష్కరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం మరో మజిలీ చేరుకుంది.
పాదయాత్ర 103 వ రోజున 1300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రతి వంద కిలోమీటర్ల కు ఒక నిర్ధిష్ట హామీ ఇస్తూ అందుకు గుర్తుగా శిలాఫలకం ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ 1300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా మరొక హామీ ఇచ్చారు.
టిడిపి ప్రభుత్వం రాగానే ఆ ప్రాంతంలో పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అందుకు గుర్తుగా నంద్యాల రూరల్ మండలం కానాల పంచాయతీలో శిలాఫలకం ఆవిష్కరించారు.