అల్లూరు లో లోకేష్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు.
శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.
అల్లూరు లో లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్లపైకి చేరుకున్న ప్రజలు.
రోడ్డు కి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేస్తున్న ప్రజలు.
మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటున్న నారా లోకేష్.
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు.
రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్న లోకేష్.
చెత్త పన్ను, బోర్డు పన్ను, ప్రోఫిషనల్ ట్యాక్స్ అంటూ వ్యాపారస్తులను వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది.
మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా పై భారం తగ్గించాలి అంటూ లోకేష్ ని కోరిన వ్యాపారస్తులు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుంది.
జగన్ అడ్డగోలుగా పెంచేసిన పన్నులు అన్ని తగ్గిస్తాం. విద్యుత్ ఛార్జీలు పై పెంచిన భారాన్ని కూడా తగ్గిస్తాం అని హామీ ఇచ్చిన లోకేష్.