ధాన్యం ఆరబోత ఫ్లాట్ ఫారాల నిర్మాణానికి లోకేష్ శిలాఫలకం
రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా నేను చేపట్టిన యువగళం పాదయాత్ర… జన ప్రభంజనంగా మారి లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో పాదయాత్ర ఈరోజు 1900 కి.మీ. మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉంది. అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్లాట్ ఫారాలు నిర్మిస్తానని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. దీనివల్ల ఈ ప్రాంత వరి రైతాంగం పండించిన ధాన్యం నాణ్యత మెరుగుపడి మార్కెట్ లో మంచి ధరకు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
-నారా లోకేష్