చంచల్ గూడా జైలు జగన్ రావాలి, కావాలి ఆంటోంది!
దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీచేస్తే షర్ట్ ఎందుకు విప్పలేదు?
నా పాదయాత్రను అడ్డుకునేందుకు కుక్కల్ని పంపిస్తున్నారు
అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ మంచినీటి కుళాయి
మంత్రాలయంలో అవినీతి బాలనాగు అరాచకాలు
కోసిగి బహిరంగసభలో యువనేత నారా లోకేష్
జగన్ రేపో, మాపో జైలుకు వెళ్లడం ఖాయం. అవినీతి కేసుల్లో వెళతాడో, బాబాయిని చంపిన కేసులో వెళతాడో వెంకన్నకే తెలుసు. అందుకే ఆయనను జైలు జగన్ అంటున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో జరిగిన భారీ బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ బాబాయిని లేపేసిన కేసులో కుటుంబం మొత్తం ఇరుక్కుపోయిందని ఆరోపించారు. ఎపిలో జగన్, అవినాష్, భారతీ రెడ్డి ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనని జనం బెట్టింగులు కాస్తున్నారు. చంచల్ గూడా జైలు జగన్ రావాలి, జగన్ కావాలి అంటోంది… శాశ్వతంగా జైలుకు పంపించే బాధ్యత ప్రజలపై ఉంది. నా పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా కుక్కల్ని పంపుతున్నారు. సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర, నా జోలికొస్తే తోలివలిచి ఇంటికి పంపిస్తా.
జగన్ ఒక చెత్త ముఖ్యమంత్రి, సింహాద్రి కొండపై కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని అసమర్థుడు, భక్తులను పోలీసులతో కొట్టించాడు, రబీలో ఎంత ధాన్యం కొంటారో ఒక పాలసీ అంటూ లేని చెత్త ప్రభుత్వం. వైసిపి ఒక రసికరాజుల పార్టీ. ఒకరు ప్యాంటు తీస్తారు, అవంతి షర్టు తీస్తారు, అంబటి అన్నీ తీస్తారు. బట్టలు లేకుండా తిరగడం వారికి ఫ్యాషన్…. వారందరరినీ ఆదర్శంగా తీసుకుని మంత్రి సురేష్ వచ్చారు.
దళిత డ్రైవర్ ను చంపినపుడు ఎందుకు షర్ట్ విప్పలేదు? విదేశీ విద్య పేరు మార్చినపుడు ఎందుకు షర్ట్ విప్పలేదు? దళితులకు 27సంక్షేమ పథకాలు రద్దుచేసినపుడు ఎందుకు షర్ట్ విప్పలేదు? నేను దళితులను అనని మాటలను అన్నట్లు ఫేక్ వీడియోలో సృష్టించి వదిలారు భారతీ రెడ్డి. దమ్మూ,ధైర్యం ఉంటే మొత్తం వీడియో బయటపెట్టండి… నిరూపించలేకపోతే సాక్షి మూసేస్తారా? దొంగలు, రౌడీలు, 420లపై ప్రజలంతా పిడికిలి బిగించి పోరాడాలి. మంత్రాలయం మాస్ జాతర చూస్తే జగన్ కి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. మంత్రాలయం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. శ్రీశ్రీ రాఘవేంద్రస్వామి నడిచిన నేల ఇది. కౌతాళం ఖాదర్ లింగ దర్గా, ఉరుకుంద ఈరన్న క్షేత్రం ఉన్న పుణ్య భూమి మంత్రాలయం. ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం అని లోకేష్ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు పాలసీలేని చెత్తప్రభుత్వం
జగన్ ది ఎంత చెత్త ప్రభుత్వమో తెలుసా? కనీసం రబీ లో ఎంత ధాన్యం కొంటారో చెప్పలేని ప్రభుత్వం ఇది. రబీ ధాన్యం కొనుగోలు పాలసీ కూడా ప్రకటించలేని చెత్త ప్రభుత్వం ఇది అని లోకేష్ విమర్శించారు. అకాల వర్షాలు కారణంగా వరి, మామిడి,మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతే కనీసం సిఎం కి సమీక్ష చేసే ఖాళీ కూడా లేదు. జగన్ కి అన్ని కన్నింగ్ బుద్ధులే అందుకే ఆయనకి జైలు జగన్ అని పేరు పెట్టాను. జైలు జగన్ పెద్ద ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్. ఆయన ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతాను. జైలు జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.
అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జైలు జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి అన్నారు.
కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్
జైలు జగన్ కట్టింగ్ మాస్టర్ అని లోకేష్ పేర్కొన్నారు. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ కోడికత్తి జగన్. జైలు జగన్ యువత ఎప్పటికీ పేదరికం లోనే ఉండాలి అనుకుంటున్నాడు.
అందుకే ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళల తాళిబొట్లు తెంచుతున్న జైలు జగన్
జైలు జగన్ మహిళల తాళిబొట్లు తెంచేస్తున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
రైతు రాజ్యం తెస్తానన్న జైలు జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జైలు జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. జైలు జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదన్నారు.
బిసిల బ్యాక్ బోన్ విరిచిన జైలు మోహన్
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు జైలు మోహన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం.
మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జైలు జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారన్నారు.
మైనారిటీలనూ ముంచేశాడు జైలుజైగన్
జైలు జగన్ ప్రభుత్వం మైనారిటీలను కూడా ముంచేసింది అని లోకేష్ విమర్శించారు. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జైలు జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.
పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు అని వివరించారు.
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్
జైలు జగన్ నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే.
రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగు కాదు. విషనాగు
మంత్రాలయం ఎమ్మెల్యే పేరు బాలనాగిరెడ్డి. మంత్రాలయం రూపురేఖలు మారుస్తాడు అని మీరు మూడు సార్లు వరుసగా గెలిపించారు. మంత్రాలయం లో మార్పు వచ్చిందా? ఇక్కడ అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అందుకే మీ ఎమ్మెల్యే పేరు మార్చాను ఆయన బాల నాగు కాదు విష నాగు అని లోకేష్ ఎద్దేవా చేశారు. తండ్రి విష నాగు, అన్న కొడుకు ప్రదీప్ రెడ్డి మంత్రాలయంని కేకులా కోసుకొని పంచేసుకున్నారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ పేరుతో మంత్రాలయాన్ని దోచేస్తుంది విష నాగు మాఫియా. మంత్రాలయం, మెలిగనూరు, తుంగభద్ర, రామాపురం, మాధపురం, గుడి కంబాలి, నదిచాగి ఇసుక రీచుల నుండి అక్రమంగా ఇసుక దోచేస్తున్నాడు విష నాగు. పెదకడుబూరు లో సెంటు స్థలాల కొనుగోలు లో భారీ స్కామ్ చేసాడు విష నాగు. ఐదు ఎకరాల భూమి ఎకరా 5 లక్షలకు కొని ప్రభుత్వానికి 40 లక్షలకు అమ్మేసాడు. ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడో తెలుసా? వాగులు, వంకలు. ఈ విష నాగు అక్కడ ఒక్క రోజైనా ఉండగలడా? సెంటు స్థలాల కోసం దళితుల భూములు లాక్కున్నారు. కోసిగిలో ఓ దళిత రైతు రామాంజనేయులు కి చెందిన 4 ఎకరాల భూమిని లాక్కున్నారు విష నాగు అని ఆరోపించారు.
తలనీలాలు, కొబ్బరికాయలనూ వదల్లేదు
చిన్న తుంబళం గ్రామం రాయలచెరువులో తరతరాలుగా చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను తరిమేసి చెరువు ఆక్రమించుకున్నాడు ఈ విష నాగు అని లోకేష్ ధ్వజమెత్తారు. ఆఖరికి దేవుడ్ని కూడా వదలలేదు మీ విష నాగు. ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో టెంకాయలు, తలనీలాలు కూడా టెండర్ లేకుండా కొట్టేసారు ఈ విషనాగు అనుచరులు. రాగిమానుదొడ్డి, కంబధహాల్ గ్రామంలోని ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. టిప్పర్ ఎర్రమట్టిని రూ.6 వేలకి అమ్మేస్తున్నారు. తుంగభద్ర కేంద్రం గా అక్రమ బియ్యం మాఫియా నడుపుతున్నాడు విష నాగు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక తరలిస్తున్నారు. బళ్లు ఖాళీగా తేవడం ఎందుకు అని కర్ణాటక మద్యం తెప్పిస్తున్నాడు.
కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి పల్లెపల్లెకు ఎమ్మెల్యే దగ్గరి బంధువు మురళి రెడ్డి మద్యం మాఫీయా నడుపుతున్నాడు. పెదకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో ఓంకారప్ప భూమిని విష నాగు అనుచరుడు మోహన్ రెడ్డి తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. విష నాగు అన్న కొడుకు ప్రదీప్ రెడ్డి భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. మంత్రాలయంలో ఎవరు వెంచర్ వెయ్యాలన్నా ప్రదీప్ రెడ్డికి కప్పం కట్టాల్సిందేనన్నారు.
పులికనుమ ప్రాజెక్టును చేపలచెరువుగా మార్చేశాడు
రైతులకు సాగు నీరు అందిచడం కోసం ఏర్పాటు చేసిన పులికనుమ రిజర్వాయర్ను, గురురాఘవేంద్ర ప్రాజెక్టును విష నాగు చేపల చెరువుగా మార్చేసాడని లోకేష్ ఆరోపించారు. బీనామీలతో చేపల వ్యాపారం చేయిస్తూ కోట్లు గడిస్తున్నాడు. అడ్డుకున్న రైతుల్ని పోలీస్ స్టేషన్ కి పిలిచి కేసులు పెట్టారు. రూ. 11 కోట్లతో చేపట్టిన శ్రీకృష్ణ దేవరాయ కాలువ ఆధునీకరణలో ఎమ్మెల్యేకి పెద్ద ఎత్తున ముడుపులు అందాయి. విష నాగు ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అయినా వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకో తెలుసా? ఈ ఫ్యామిలీ అవినీతి లో ఎక్కడ తనని మించిపోతారో అని జగన్ అనుకున్నాడు. అందుకే మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవి ఇవ్వనందుకు జగన్ ఒక పనికిమాలిన సిఎం అంటూ క్యాష్ ప్రసాద్ ఈ మధ్యే జగన్ పై ఎదురుదాడి మొదలు పెట్టాడు అని వివరించారు.
మంత్రాలయాన్ని అభివృద్ధి చేసింది టిడిపి
మంత్రాలయాన్ని అభివృద్ధి చేసింది టిడిపి అని లోకేష్ చెప్పారు. గ్రామాల్లో సిసి రోడ్లు వేసింది టిడిపి, మంత్రాలయం లో రూ. 6 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసింది టిడిపి. రూ.13 కోట్లతో మంత్రాలయం పట్టణానికి,చిలకలదోన, సుగూరు, కల్లుదేవకుంట గ్రామాలకు రూ.13 కోట్లతో తాగునీరు అందించాం. గురు రాఘవేంద్ర స్వామి, ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాలను అభివృద్ధి చేసి పన్ను మినహాయింపు ఇచ్చాం. అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచి నీటి సౌకర్యం కల్పిస్తే..స్టికర్లు మాత్రం వైసీపీ పార్టీవి వేసుకుంటున్నారు. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించటం జరిగింది. కానీ మీరు ఏమి చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.
ఉపాధి అవకాశాలు, వ్యవసాయ పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని టీడీపీ ప్రభుత్వంలో రూ.1,986 కోట్లు మంజూరు చేసి ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కోసిగి ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తాం
కోసిగిలో తాగునీరు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. కోసిగి లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని లోకేష్ వెల్లడించారు. కోసిగిలో ఇండోర్ స్టేడియం కోసం టీడీపీ ప్రభుత్వంలో రూ.3కోట్లు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిధులు ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేస్తాం. కోసిగి లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వేరు శనగ, మిరప, పత్తి, ఉల్లి రైతులు పడే కష్టాలు నాకు తెలుసు. మీకు పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.15 కోట్లు ఇవ్వకపోవడంతో ఒక్క టీఎంసీల కూడా లిఫ్ట్ చేయలేదు.
ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఆ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. మంత్రాలయం మండలం సూగూరు, వగరూరు, బూదూరు, తిమ్మాపురం, చెట్నహల్లె, కలుదేవకుంట, చిలకలడోన గ్రామాలకు తుంగభద్ర నది నుంచి తాగునీరు అందించేందుకు టీడీపీ ప్రభుత్వంలో రూ.11 కోట్లతో పనులు మొదలు అయ్యింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లు పట్టించుకోలేదు. ఆ పనులు పూర్తి చేసి తాగునీరు అందిస్తాం. 2009 వరదలకు మంత్రాలయం పూర్తిగా మునిగి పోయింది. ఫ్లడ్ వాల్ నిర్మాణం కలగానే మిగిలింది. 2009 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి ఫ్లడ్ వాల్ గురించి పట్టించుకోలేదు. టిడిపి అధికారంలోకి రాగానే ఫ్లడ్ వాల్ నిర్మాణం చేపడతామని లోకేష్ హామీ ఇచ్చారు.