- రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్
- విధ్వంసకపాలనలో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీ
- సీమను అభివృద్ధి బాటపట్టించిన విజనరీ చంద్రబాబు
- మిషన్ రాయలసీమతో సీమప్రజల కష్టాలు తీర్చాలి
- కలికిరి సభలో టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్
పీలేరు (కలికిరి): ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మన నరేంద్ర మోదీజీ… కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగిన ఎన్నికల ప్రచారసభకు ప్రధాని మోదీతో కలిసి యువనేత హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీజీకి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించిన లోకేష్… మంగళగిరి శాలువాతో ప్రధానిని సత్కరించారు. అనంతరం సభనుద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ… గత పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో మనం చూసాం. మోదీ మాటలో దమ్ముంటుంది. మోదీ నడక లో ధైర్యం ఉంటుంది. మోదీ ఉంటే దేశానికి భరోసా ఉంటుంది. మోదీ ఉంటే 100 పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా. మోదీ నుండి రెండు విషయాలు ఆదర్శంగా తీసుకున్నాను. మొదటిది మోదీకి తల్లి హీరా బెన్ మోదీ అంటే ప్రేమ. రెండోవది మోదీకి భారతదేశం అంటే భక్తి. సంపద ఎలా సృష్టించాలో మోదీకి తెలుసు. ఆ సంపద ద్వారా పిరమిడ్ దిగువన ఉన్న వ్యక్తులను శక్తివంతం చేయాలో కూడా ఆయనకు తెలుసు. ఒకప్పుడు విదేశాలు వెళితే ఇండియా నుండి వచ్చాం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మన కేరాఫ్ అడ్రెస్స్ మారింది… నరేంద్ర మోదీ పేరు చెబితే చాలు. సౌత్ , నార్త్ , ఈస్ట్ , వెస్ట్ అందరూ అంటుంది ఒకటే నమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. వచ్చే పదేళ్లలో మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా అవతరించడం ఖాయం. సంపద ఎలా సృష్టించాలో, పేదరికం నుంచి అట్టడుగువర్గాల ప్రజలకు ఎలా బయటకు తీసుకురావాలో ఆయనకు తెలుసు. గత పదేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్యాలెన్స్ చేస్తూ రాజకీయనాయకులను తలెత్తుకుని తిరిగేలా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని లోకేష్ కొనియాడారు. రాయలసీమ లో పాదయాత్ర చేసినప్పుడు తమ దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను మాటల సందర్భంగా ప్రధానికి వివరించారు.
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్….
పౌరుషాల గడ్డ, రత్నాలసీమ రాయలసీమ. సీమకు నీరిస్తే బంగారం పండిస్తారు. తెలుగు గంగ ద్వారా సీమ కు నీరు ఇచ్చి కరువు ప్రాంతంలో బంగారం పండేలా చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు. 2019 ఎన్నికల్లో జగన్‌రెడ్డి రాయలసీమ బిడ్డని అనగానే నమ్మి ప్రజలు మోసపోయారు. అతను రాయలసీమకు క్యాన్సర్ గడ్డ లా తయారు అయ్యాడు. జగన్ విధ్వంసక పాలనలో రాయలసీమ 30 ఏళ్లు వెనక్కి పోయింది. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు. టీడీపీ 2014- 19 వరకూ చేసిన ఖర్చులో 10 శాతం కూడా సాగునీటి ప్రాజెక్టుల పైన చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ఇసుక దోపిడీ కారణంగా అన్నమయ్య, పించా డ్యాంలు కొట్టుకుపోయాయి. 38 మంది చనిపోయారు. బాధితులకు కనీసం ఇళ్లు కట్టించలేని చెత్త ప్రభుత్వం ఇది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కి రెండు సార్లు శంకుస్థాపన చేసాడు కానీ ఒక్క ఇటుక పెట్టలేదు. రాయలసీమ రైతులకు వరంగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ని చంపేసాడు. అందుకే ఆయన కడప బిడ్డ కాదు కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ. సీమలో పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రజాగళం ఏర్పడిరది. పొత్తు కోసం త్యాగం చేసింది పవన్ అన్న. నాకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్రం, ప్రజలు ముఖ్యం అని ఓపెన్ గా చెప్పే దమ్మున్న నేత మన పవన్ అన్న. సంక్షేమం – అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళతాం. కూటమి అభ్యర్థులను గెలిపించండని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
సీమలో కార్లపంట పండిరచిన విజనరీ చంద్రబాబు…
వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల- వికసిత్ రాయలసీమ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కల. 2014 లో రాష్ట్ర విభజన, కట్టుబట్టలతో మన ప్రయాణం మొదలైంది. చంద్రబాబుకు ఉన్న అనుభవం, విజన్ వలన రాయలసీమని అభివృద్ధి బాట పట్టించారు. కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు సీమ గడ్డ పై రక్తం పారిస్తే చంద్రబాబు నీళ్లు పారించారు. 5 ఏళ్ల లో సీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు గారు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 12 వేల కోట్లు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు ఇవ్వాలని రూ.22 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పధకాన్ని రూపొందించాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఫ్యాక్స్కాన్ , టిసిఎల్ , డిక్సన్ లాంటి ఎన్నో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కరువు జిల్లా అనంతపూర్ లో కియా కార్లు పండిరచారు విజనరీ లీడర్ చంద్రబాబు. కర్నూలు కి ఎయిర్ పోర్ట్, జైన్ ఇరిగేషన్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. పులివెందులకు నీరు ఇచ్చిన లీడర్ మన సిబిఎన్. 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ అందించింది చంద్రబాబు. నరేంద్ర మోదీ సహకారంతో నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామాల రూపు రేఖలు మార్చే అదృష్టం నాకు వచ్చింది. నేను 2018లో పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు మీ ద్వారా ప్రేరణ పొంది రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసిరోడ్లు నిర్మించాను. 10లక్షల పంటకుంటలు తవ్వించా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాను. మీరు అందించిన సహాయ, సహకారాలకు కృతజ్ఞతలు.
మిషన్ రాయలసీమకు సహకారం అందించండి…
నేను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినపుడు ఎక్కువ సమయం రాయలసీమలో గడిపి అక్కడి ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశాను. రాబోయే మన ప్రభుత్వం సీమపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సీమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి మేము మిషన్ రాయలసీమను రూపొందించాం. రాయలసీమను ప్రపంచానికి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. ఇందుకు పంట ఆధారిత పరిశోధన కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. రాయలసీమలో పెండిరగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రైతులను ఆదుకోవడానికి గతంలో డ్రిప్ ఇరిగేషన్ పై ఇచ్చిన 90శాతం సబ్సిడీని కొనసాగించాల్సి ఉంది. ఇప్పటికే విజయవంతమైన డెయిరీ సెక్టార్‌పై కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించాం. మీరు ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలనుకుంటున్నాం. మీ మేక్ ఇన్ ఇండియా విజన్‌లో కూడా మేము ముఖ్యమైన పాత్ర పోషించాలనుకుంటున్నాం. మేము రాయలసీమను ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ ఆఫ్ ఇండియాగా మార్చాలనుకుంటున్నాం. మీ ఖేలో ఇండియా విజన్‌లో భాగంగా కడపను ఆంధ్రప్రదేశ్ క్రీడా రాజధానిగా మార్చాలనుకుంటున్నాం. మీరు ఎల్లప్పుడూ దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు, అందుకు రాయలసీమ అద్భుతమైన అవకాశాలున్న ప్రాంతం. మేము టెంపుల్, టైగర్ ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఇందుకు మీ వంతు సహాయ,సహకారాలను అందించాలని కోరుతున్నాను. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్… అబ్కీ బార్ 400 పార్. దేశవ్యాప్తంగా 400 సీట్లను అధిగమించాలన్న మీ లక్ష్యంలో ఎపి ప్రజలు భాగస్వాములవుతారని యువనేత లోకేష్ అన్నారు.