చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వినుకొండను మాఫియాలకు అడ్డాగా మార్చిన ఘనుడు నటబ్రహ్మ

by చైతన్యరధం
Nov 15, 2022 at 10:45am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
వినుకొండను మాఫియాలకు అడ్డాగా మార్చిన ఘనుడు నటబ్రహ్మ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పేదల ఇళ్లస్థలాల పేరుతో రూ.18 కోట్ల దోపిడీ
  • రూ.700 కోట్ల విలువైన ఎన్‌ఎస్‌పి భూములపై కన్ను
  • అడుగడుగునా భూదందా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
  • బ్రోకర్లతో ఇసుక మాఫియా.. నెలకు రూ.6కోట్లు హాంఫట్‌
  • గిరిప్రదక్షణ రోడ్డుచుట్టూ బొల్లా రియల్‌ ఎస్టేట్‌ మాఫియా
  • రేషన్‌ బియ్యం నుంచి బార్లదాకా అన్నింటా బ్రహ్మనాయుడు బినామీలే!

అమరావతి : వేషధారణ, ఆహార్యం, హావాభావాలు చూసిన వారెవరైనా ఆహా ఎంత పెద్దమనిషి..అనవసరంగా ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయని అపార్థం చేసుకుంటారు. నిజజీవితంలో ఆయన రూటే సపరేటు. కల్లాకపటం తెలియని వినుకొండను మాఫియాలకు అడ్డాగా మార్చి కోట్లు కొల్లగొడుతున్న ఆ పెద్ద మనిషి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. పేదల ఇళ్లస్థలాల నుంచి వారుతినే చౌక బియ్యం వరకు, ఇసుక మాఫియా నుంచి భూదందాల వరకు అన్నింటా తానై వ్యవహరిస్తూ అవినీతి సామ్రాజ్యానికి అనకొండలా మారారు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదల భూములను లాగేస్తూ వందలకోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్న అక్రమార్కుడాయన. తన చేతికి మంటి అంటకుండా ఒక్కోవిభాగానికి ఒక్కో బ్రోకర్‌ ను ఏర్పాటుచేసుకొని వ్యవస్థీకృత అవినీతికి తెరలేపారు.

జగనన్న కాలనీల పేరుతో రూ.18 కోట్ల దోపిడీ
వినుకొండకు 10కిలోమీటర్ల దూరంలోని వెంకుపాలెం శివార్లలో ఆవాస యోగ్యంకాని 120 ఎకరాల పనికిరాని తన భూమిని ఎకరా 18లక్షల రూపాయలకు జగనన్న కాలనీ కోసం ప్రభుత్వానికి అంటగట్టి భారీఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. కేవలం 4లక్షల రూపాయల విలువచేసే ఆభూమిని 18లక్షల కు ప్రభుత్వానికి అప్పగించి 18 కోట్లరూపాయల ప్రభుత్వ సొమ్ము కొట్టేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టకుండా సొంత భూములకు రేటు పెంచుకు నేందుకు తన తెలివితేటలను చూపించి పేదల కోసమంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కూడా ఆదాయవనరుగా మార్చుకున్నారు.

సంబంధితవార్తలు

రేషన్‌ బియ్యం దందాలో ఐదుగురు ఐపీఎస్‌లు

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది

వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేసేది చంద్రబాబే

700 కోట్ల ఎన్‌ఎస్‌ పి భూములపై కన్ను
ఎన్‌ఎస్‌ పి కాలనీకి చెందిన 22.18 ఎకరాల విలువైన స్థలాన్ని అడ్డదారుల్లో తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి విలువ సుమారు 700 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఉంది. పట్టణ నడిబొడ్డున 4.5ఎకరాల అత్యం త విలువైన భూమిని కొట్టేసేందుకు ఇండోర్‌ స్టేడి యం చుట్టూ ప్రహరీగోడ కూలదోశారు. డిగ్రీ కాలేజి భూమిని కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్నారు. తన తిరుమల హాస్పటల్‌ రోడ్డు కోసం ఆర్యవైశ్యులు పెనుగొండ శ్రీనివాసరావు, సుబ్బారావులకు చెందిన 11 సెంట్లలో ఉన్న పెట్రోలు బంకును కొట్టించేసి సుమారు 40లక్షల రూపాయలతో రోడ్డు వేయించు కున్నాడు.

అధికారం అండతో యథచ్చేగా రియల్‌ వ్యాపారం

వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయాన్ని అడ్డంపెట్టుకొనిచేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోనే వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో ప్రముఖ కాంట్రాక్టర్‌ విసి నరసింహారెడ్డి, తెనాలికి చెందిన వ్యాపారుల మధ్య సుమారు పది ఎకరాల భూ వివాదాన్ని బెదిరించి చౌకబారుగా కొట్టేసి ఒక్క సారిగా 40కోట్ల రూపాయల లబ్ధిపొందారు. ఆయన తన బినామీలతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో ఆక్రమించి, వెంచర్లు వేయిస్తూ వం దల కోట్లు గడిస్తున్నాడు. వెల్లటూరు రోడ్డులో 18 ఎకరాల పోరంబోకు భూమికిట్టాలు సృష్టించి అను చరుల పేర్లు రాయించుకున్నారు. ఈపూరు మండ లంలో 32ఎకరాల భూమిని ఎమ్మెల్యే దగ్గరుండి అన్యాక్రాంతం చేశారు. జల్లపాలెం వద్ద రైతులను భయపెట్టి తక్కువ రేటుకు 30 ఎకరాలు కొనుగోలు చేశారు. వినుకొండ పట్టణానికి ఆనుకుని ఉన్న 8 ఎకరాలు ప్రభుత్వ భూమిని రికార్డులు తారుమారు చేసి మింగేశారు.
బొల్లాపల్లి మండలంలో 132 ఎకరాలు ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్ల మీద రాయించుకున్నారు. వెల్లటూరు రోడ్‌లోని వినుకొం డ కొండ చుట్టూ ఉన్న వివాద భూములను తన అనుయాయులతో రౌడీయిజం చేసి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ వెంచర్లువేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపా రం చేస్తున్నారు.
రామలింగేశ్వరస్వామి ఘాట్‌ రోడ్డు నిర్మాణం అంటూ కొండచుట్టూ గిరి ప్రదక్షణ రోడ్డు ను పట్టణ పురపాలక సంఘం నిధులతో ఏర్పాటు చేసి తన భూములకు విలువ పెంచుకొని విల్లాస్‌, టవర్స్‌ నిర్మిస్తూ కోట్లకు పడగలెత్తాడు. గిరిప్రదక్షిణ రోడ్డు చుట్టూ భూములను చౌకగా లాగేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీశాడు.

ఇసుక దందాతో రోజుకు రూ.6కోట్లు
గుండ్లకమ్మ నుంచి ప్రతిరోజు 200 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరు డైన ములకలూరు సర్పంచ్‌ బాబు, రామిరెడ్డి, దద్దాల వీరయ్య, డాన్‌ చౌదరి అనే వారి యథేచ్చగా అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం వినుకొండలో ట్రాక్టర్‌ ఇసుక 10వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజూ 20లక్షల రూపాయల చొప్పున నెలకు 6కోట్లరూపాయలు దోచుకుంటు న్నారు. గుండ్లకమ్మ నదితో పాటు దగ్గరలో ఉన్న వాగుల్లో ఇసుక అక్రమంగా తరలించి విక్రయిం చేందుకు తన ఇసుక మాఫియా టీంని ఏర్పాటు చేసుకొని యదేచ్చగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు ఇసుక దందా చేస్తున్నాడు.

మాఫియా సామ్రాజ్యాధినేత ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

పల్నాడులో ప్రశాంతతకు పెట్టింది పేరైన విను కొండను బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మాఫియాల రాజ్యంగా మార్చేశాడు. భూ మాఫియా, రేషన్‌ మాఫియా,మద్యం మాఫియా, ఇసుక మాఫియా లను నడుపుతూ కోట్లాదిరూపాయల అక్రమార్జనకు తెరలేపారు. రేషన్‌ బియ్యం : పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని మూడో కంటికి తెలియకుండా దారి మళ్ళించేందుకు కొప్పెర్ల దేవదాసును నియమించారు. ఇతనే సర్పంచ్‌ గా పనిచేస్తూ రేషన్‌ బియ్యం మాఫియాను నడుపుతు న్నాడు. ఇక్కడి నుంచి తెలంగాణాకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. విను కొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఈపూరు, శావ ల్యాపురం, నూజెండ్ల, వినుకొండ మండలాల్లో అక్రమ రేషన్‌ మాఫియా నడిపేందుకు బొల్లా బ్రహ్మనాయుడు ఒక కోటరిని ఏర్పాటు చేసుకొని మూడేళ్లగా రేషన్‌ మాఫియా సాగిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు.

మద్యం మాఫియా : పొరుగున ఉన్న తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని దిగుమతి చేసు కుని అమ్మే బాధ్యతను వెంకట్రామిరెడ్డి అప్పగించారు. నెలకు రూ.20 లక్షలకు పైగా ప్రత్యేక సూట్‌ కేసులో బ్రహ్మనాయుడు ఇంటికి తరలిస్తుంటారు. నియోజక వర్గంలోని బార్లన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఉంటాయి. రాత్రయ్యేసరికి లెక్కలు చూసి వాటా ఎమ్మెల్యే ఇంటికి పంపడంలో లేటయితే ఎట్టి పరిస్థితిలోను సహించరు. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన బార్ల టెండర్లలో కూడా బెదిరింపులకు పాల్పడి తన అనుచరులకే టెం డర్‌ దక్కేలా చక్రం తిప్పాడు రియల్టర్‌ బ్రహ్మనాయు డు. ప్రభుత్వ మద్యం షాపుల్లో తన బినామీ వర్గీయు లను చేర్చి మండలానికి 20 బెల్ట్‌ షాపులు పెట్టించి మద్యం మాఫియాతో కోట్లు గడిస్తున్నారు.

ఇసుక మాఫియా: గుండ్లకమ్మ నుండి, ములక లూరు, పిట్టంబండ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నిర్వహించే బాధ్యత స్థానిక వైసీపీ నేతలకు అప్పగించి 50పైసలు వాళ్లకు, మరో 50పైసలు ఎమ్మెల్యే ఇంటికి పంపించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ 200 ట్రాక్ట ర్లకుపైగా ఇసుకను అనధికారికంగా విక్రయిస్తూ నెల కు ఆరుకోట్ల రూపాయలు గడిస్తున్నారు.
భూ మాఫియా: వినుకొండలో వెల్లటూరు రోడ్డులో 4 ఎకరాల వివాదాస్పదమైన భూమిని స్వాధీనం చేసు కుని అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులు తారుమారు చేశారు. ఈ భూమి ధర పెంచడానికి ప్రభుత్వ ధనం తో ఆగమేఘాల మీద రహదారులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అపార్ట్‌మెంటు కట్టేందుకు పనులు కూడా మొదలుపెట్టారు. ఎవరైనా రైతుల భూములకు పాస్‌బుక్‌ ఇవ్వాలన్నా, ఆన్‌ల్కెన్‌లో పొందుపరచాలన్నా బొల్లా బినామీలు ప్రత్యేకమైన రేటు నిర్ణయించారు. బొల్లాపల్లి మండలంలో 10వేల ఎకరాల్లో పాస్‌బుక్‌లు ఇప్పించి ఒక్కో రైతుల నుంచి ఎకరాకు రూ.10 వేలు వసూలు చేశారు. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్‌ చేయించడం,ప్రభుత్వ భూములకు పాస్‌బుక్‌లు ఇప్పిం చడం, ఆ భూములను బ్యాంకులో పెట్టి రుణాలు తెచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దారిమళ్లించడం బొల్లా బ్రహ్మనాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. మండలాని కో మాఫియా ముఠాలను ఏర్పాటు చేసుకుని రైతుల భూముల్లో వాలిపోతున్నారు. తక్కువ ధరకు అమ్మా లంటూ బెదిరింపులకు దిగుతున్నారు, లేదంటే అధి కార బలాన్ని ప్రయోగిస్తున్నారు. బొల్లాపల్లిలో రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టిం చి అత్యంత విలువైన భూమిని తనతోపాటు, అనుచ రుల పేరుమీద మ్యుటేషన్‌ చేయించుకున్నారు.

Tags: ఆహార్యంఇసుక మాఫియాఎన్‌ఎస్‌పి భూములుజగనన్న కాలనీపేదల ఇళ్లస్థలాలుబార్లుబ్రహ్మనాయుడుభూదందారియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంరూ.18 కోట్ల దోపిడీరేషన్‌ బియ్యంవినుకొండవెంకుపాలెంవేషధారణహావాభావాలు
Previous Post

జగన్‌రెడ్డి హాలిడే తీసుకోవడమే మిగిలింది

Next Post

జగన్‌రెడ్డి నిర్వాకం వల్లే ఆక్వారైతుల అష్టకష్టాలు

మరిన్ని వార్తలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!
ఆంధ్రప్రదేశ్

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..
ఆంధ్రప్రదేశ్

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!
ఆంధ్రప్రదేశ్

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
ఐక్యంగా, అప్రతిహతంగా..!
ఆంధ్రప్రదేశ్

విజన్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పనులు

చైతన్యరధం
@ February 20, 2026
ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

చైతన్యరధం
@ February 20, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist