- భవిష్యత్‌ను ముంచేసిన జగన్ దా‘రుణం’
- సచివాలయం తాకట్టుపై తెలుగుజాతి భగ్గు
- పక్కా ప్రణాళికతోనే వైసీపీ బరితెగింపు
- కట్టడం చేతకాదుకానీ.. అప్పులకు ‘సిద్ధం’
అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వ హయాంలో నవ్యాంధ్ర ప్రజల ఉజ్వల భవిష్యత్‌కు చిహ్నాలుగా చేపట్టిన నిర్మాణాలనే `ప్రస్తుత సర్కారు బండి నడపడానికి ‘ఇంధనం’ చేసుకుంది. నవ్యాంధ్రను అప్పుల కుప్పగా మార్చి పరువు తీసిన జగన్ సర్కారు, రాజధాని భవనాలనూ తాకట్టు పెట్టడంపై తెలుగు ప్రజలు భగ్గుమంటున్నారు. చేతకాని అసమర్థ పాలనతో జగన్, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపేస్తున్నాడంటూ విపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి… ప్రాంతాలవారీ రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనమైన జగన్ సర్కారు ఘనకార్యాన్ని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన జగన్, తన చేతకానితనంతో ‘నవ్యాంధ్ర భవిష్యత్‌ను తాకట్టులో పడేయడంపై గగ్గోలు మొదలైంది. గద్దెనెక్కిన దగ్గర్నుంచీ రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధ్వంసానికి గురిచేసిన జగన్ సర్కారు, అదే రాజ ధానిలోని రాష్ట్ర సచివాలయాన్నీ తాకట్టుకు రాసిచ్చేయ డం విస్మయానికి గురిచేస్తుంది.
రాష్ట్ర బడ్జెట్ రూ.2.86 లక్షల కోట్లు. అయినా పరిపాలనా బండి నడపలేక రూ.370 కోట్ల కోసం నవ్యాంధ్ర ప్రజల భవితకు ప్రతీక అయిన సచివాలయా న్ని తాకట్టు పెట్టడం జగన్ సర్కారు దా‘రుణ’ దాహానికి నిదర్శనమే. అమరావతిలో విడిగావున్న శాసన సభ, శాసనమండలి భవనాలు వినా.. సచివాలయంలోని ఐదు బ్లాకులను జగన్ సర్కారు తాకట్టు పెట్టడం జీర్ణిం చుకోలేని అంశం. క్షమించరాని నేరం. కొద్దిరోజుల కిందట ` సచివాలయం సమీపంలోని అధికారుల నివాస భవనాలూ వార్తాంశమే అయ్యింది. నిర్మాణం పూర్తికాని భవనాల్లో అధికారులు నివసిస్తున్నారని, సీఆర్డీయేకు రూ.70కోట్లు అద్దె కూడా చెల్లించామంటూ జీవో విడుదల చేసింది యంత్రాంగం. ఈ జీవో వెనుక చీకటి కోణమేదో దాగివుందని తెలుగుదేశం అప్పుడే అనుమానించింది, నిలదీసింది. నిర్మాణం పూర్తికాని భవనాల్లో నివాసం ఉండటమేంటి? దానికి అద్దె చెల్లిం చడమేమిటంటూ వైసీపీ సర్కారును తెదేపా నిలదీసిం ది. వైసీపీ బాగోతాన్ని పార్టీ తరఫున జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఎండగట్టారు. `నిర్ణీత గడువు లోగా నిర్మాణాలు పూర్తికాకపోతే తీసుకున్న అప్పు మొత్తం తిరిగి చెల్లించాలనే షరతుతో రుణం సేకరించి ఆ నిర్మాణాలు చేపట్టారు. అప్పుకట్టలేక, నిర్మాణాలు పూర్తి చేయలేక.. పెనాల్టీలు కట్టాల్సి వస్తుందన్న భయంతో ప్రభుత్వం ఇలాంటి దిగజారుడు జీవోలకు ఉపక్రమించిందనే అంతా భావించారు.
కాని `ఇప్పుడు అసలు విషయం బయటపడిరది. ఈ భవనాలనూ తాకట్టుపెట్టి అప్పు తెచ్చేందుకే ‘అద్దె’ నాటకాన్ని తెరపైకి తెచ్చిందన్న విషయం స్పష్టమవుతోంది. సచివాలయ భవనాల తాకట్టు అనంతరమే… అధికారుల భవన సముదాయాలనూ తాకట్టు పెట్టి అప్పు తెచ్చే ఆలోచన లో ఉన్నట్టు అర్థమవుతోంది. రాష్ట్రంలో లిక్కర్ వ్యాపా రాన్ని తాకట్టు పెట్టి రూ.48వేల కోట్ల అప్పులు తెచ్చారు. వైజాగ్‌లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. రోడ్లు, భవనాల శాఖ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7000 కోట్లు తెచ్చుకున్నారు. చివరికి.. రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు.